Rahul Gandhi: ఇప్పటి ధరకు అప్పట్లో రెండు గ్యాస్ సిలిండర్లు వచ్చేవి.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఆగ్రహం..
2014లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఎల్‌పీజీ గ్యాస్ ధర రూ.410 ఉందని.. అప్పుడు సిలిండర్‌పై రూ.827 సబ్సిడీ అందించామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Rahul Gandhi Hits Out Modi Govt: దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, వంట గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. గత కొన్ని నెలలుగా రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ (LPG Price Hike) ధరలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తమ హయాంలో కంటే ప్రస్తుత బీజేపీ పాలనలో ఇంధన ధరలు రెండింతలు పెరిగాయంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక సిలిండర్ వంటగ్యాస్ ధరకు 2014లో రెండు సిలిండర్లు వచ్చేవంటూ గుర్తుచేస్తూ రాహుల్ ట్విట్ చేశారు. ప్రస్తుతం 1 సిలిండర్ వంట గ్యాస్ సిలిండర్ ధరకు అప్పట్లో (కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో) రెండు సిలిండర్లు వచ్చేవి.. 2014లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఎల్‌పీజీ గ్యాస్ ధర రూ.410 ఉందని.. అప్పుడు సిలిండర్‌పై రూ.827 సబ్సిడీ అందించామన్నారు. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎల్‌పీజీ ధర రూ.999 కు చేరిందని.. సబ్సిడీ మాత్రం సున్నా అంటూ మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. అదే మన ఆర్థికవ్యవస్థ విధానంలో అత్యంత ప్రాధాన్యత అంశమంటూ రాహుల్ ట్విట్ చేశారు.
కాగా.. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎల్‌పీజీ సిలిండర్ ధరలను పెంచడంపై ఆయిల్ సంస్థలు దృష్టిసారిస్తున్నాయి. శనివారం నాడు ఒక సిలిండర్ ధర రూ.50 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గడిచిన ఆరు వారాల్లో గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. ప్రస్తుతం దేశంలోని చాలా నగరాల్లో 14.2కిలోల సిలిండర్ వంటగ్యాస్ ధర వెయ్యికి చేరువకాగా.. హైదరాబాద్‌లో రూ.1052కి పెరిగింది. పలు పట్టణాల్లో సిలిండర్ ధర రూ.1070కి పెరిగినట్లు వినియోగదారులు పేర్కొంటున్నారు.
LPG Cylinder
Rate Subsidy INC (2014) ₹410 ₹827 BJP (2022) ₹999 ₹0
2 cylinders then for the price of 1 now!
Only Congress governs for the welfare of poor & middle class Indian families. It’s the core of our economic policy.
— Rahul Gandhi (@RahulGandhi) May 8, 2022
ఇదిలాఉంటే.. గత కొన్ని నెలలుగా డీజిల్, ఎల్‌పీజీ, పెట్రోల్ వంటి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. దీని కారణంగా ధరలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: