Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Interest Rates: వినియోగదారులకు అలర్ట్.. వడ్డీ రేట్లు మార్పు చేసిన ఆ రెండు బ్యాంకులు..

Interest Rates: ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించాయి. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.

Interest Rates: వినియోగదారులకు అలర్ట్.. వడ్డీ రేట్లు మార్పు చేసిన ఆ రెండు బ్యాంకులు..
Banks
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 08, 2022 | 12:27 PM

Interest Rates: ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంకుఆఫ్ ఇండియా(Union Bank) , పంజాబ్ నేషనల్ బ్యాంకులు(Panjab National Bank) తమ వడ్డీ రేట్లను సవరించాయి. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన సేవింగ్స్ అకౌంట్లపై చెల్లిస్తున్న వడ్డీ రేట్లలో మార్పులు చేయగా.. పంజాబ్ నేషనల్ బ్యాంకు తన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను మారుస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా సేవింగ్స్ అకౌంట్లలో(Savings Account) రూ.50 లక్షలు ఉన్నట్లయితే దానిపై 2.75 శాతం వడ్డీని చెల్లించనుంది. అంతకుముందు ఈ వడ్డీ రేటు 2.90 శాతంగా ఉండేది. అలాగే రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉన్నట్లయితే.. 3.10 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లించనుంది. అంతకుముందు ఈ వడ్డీ రేటు 2.9 శాతంగా ఉండేది. రూ.500 కోట్లకు నుంచి రూ.1000 కోట్ల వరకు ఉండే డిపాజిట్లకు బ్యాంకు 3.4 శాతం వడ్డీని అందిస్తుంది. అలాగే రూ.1000 కోట్ల పైనున్న డిపాజిట్లకు 3.55 శాతం వడ్డీని అందించనుంది. ఈ వడ్డీ రేటు అంతకుముందు 2.9 శాతంగా ఉండేవి. మార్పులు చేసిన ఈ వడ్డీ రేట్లు జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకు తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై(FD) వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 7 రోజుల నుంచి 45 రోజుల్లో మెచ్యూర్ అయ్యే రూ.2 కోట్ల కంటే తక్కువున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బ్యాంకు 3 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ వడ్డీ రేటు అంతకుముందు ఈ రేటు 2.9 శాతంగా ఉంది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అలాగే 46 రోజుల నుంచి 90 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు మాత్రం వడ్డీ రేట్లను మార్చలేదు. ఈ కాలానికి కస్టమర్లు 3.25 శాతం వడ్డీని పొందవచ్చు. అదేవిధంగా 91 రోజుల నుంచి 179 రోజుల్లో మెచ్యూర్ అయ్యే మొత్తాలపై బ్యాంకు 3.8 శాతం నుంచి 4 శాతానికి వడ్డీ రేటును పెంచింది. 180 రోజుల నుంచి ఏడాది వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంకు 10 బేసిస్ పాయింట్లు పెంచి 4.5 శాతానికి చేర్చింది. అదేవిధంగా ఏడాది నుంచి రెండేళ్ల లోపల మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 5.1 శాతం, మూడేళ్ల లోపల మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 5.1 శాతం వడ్డీ రేటును బ్యాంకు ఆఫర్ చేస్తుంది. మూడేళ్ల నుంచి పదేళ్ల లోపల మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 5.25 శాతంగా కొనసాగిస్తోంది.

ఇవీ చదవండి..

Google Pay Loan: గూగుల్ పే నుంచి లక్ష వరకు పర్సనల్ లోన్.. సులువుగా ఇలా పొందండి..

Digital Banking Units: 75 జిల్లాల్లో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు.. ప్రజలకు మరింత చేరువకానున్న సేవలు..