Google Pay Loan: గూగుల్ పే నుంచి లక్ష వరకు పర్సనల్ లోన్.. సులువుగా ఇలా పొందండి..
Google Pay Loan: కొన్నిసార్లు మనకు అనుకోకుండా డబ్బు అత్యవసరం అవుతుంటుంది. ఆ సమయంలో చాలా మంది బ్యాంకుల నుంచి ఎక్కువ వడ్డీ రేట్లకు పర్సనల్ లోన్ పొందేందుకు ప్రయత్నం చేస్తుంటారు.
Google Pay Loan: కొన్నిసార్లు మనకు అనుకోకుండా డబ్బు అత్యవసరం అవుతుంటుంది. ఆ సమయంలో చాలా మంది బ్యాంకుల నుంచి ఎక్కువ వడ్డీ రేట్లకు పర్సనల్ లోన్ పొందేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు సరికొత్త వెసులు బాటు అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా మీరు అత్యవసరమైనప్పుడు వెంటనే లక్ష రూపాయల లోన్ పొందవచ్చు. ఈ సౌకర్యాన్ని అందిస్తోంది మనం నిత్యం ఉపయోగించే గూగుల్ పే (Google Pay) యాప్. అవును ఇది వింటానికి కొంత ఆశ్చర్యకరంగా ఉన్నా తెలుసుకుంటే అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. ఈ పేమెంట్స్ యాప్ ద్వారా మీరు లక్ష రూపాయల వరకు తక్షణ రుణం పొందేలా కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
వాస్తవానికి గూగుల్ పే DMI ఫైనాన్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. భాగస్వామ్యం కింద రెండు కంపెనీలు సంయుక్తంగా డిజిటల్ పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి. దీనిని 36 నెలలు లేదా గరిష్ఠంగా 3 సంవత్సరాల వాయిదాల్లో తిరిగి చెల్లించవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం DMI ఫైనాన్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో దేశంలోని 15,000 పిన్ కోడ్‌లలో అందుబాటులో ఉంది. ఈ లోన్ తీసుకోవడానికి కస్టమర్ గూగుల్ పే వినియోగదారునిగా ఖాతా కలిగి ఉండాలి. లోన్ పొందాలనుకునే వారు మంచి క్రెడిట్ హిస్టరీ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ లోన్ పొందటం కుదురుతుంది.
ప్రీ-క్వాలిఫైడ్ అర్హత కలిగిన వినియోగదారులు DMI ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి ఈ లోన్ పొందవచ్చు. లోన్ వాయిదా చెల్లింపులను గూగుల్ పే ద్వారా చేయవచ్చు. ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్‌లు ఉన్నట్లయితే.. కస్టమర్ లోన్ అప్లికేషన్ రియల్ టైమ్‌లో ప్రాసెస్ చేయబడుతుంది. కొంత సమయం తర్వాత మీరు అప్లై చేసిన ఖాతాలో లోన్ తీసుకున్న మెుత్తం జమ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Income Tax: మారిన టాక్స్ రూల్స్ తెలుసుకోకపోతే నష్టపోతారు జాగ్రత్త..!