Office Lunch Time: ఆఫీస్‌లో వర్క్ చేస్తూ తింటున్నారా.. అయితే మీ ఉద్యోగం ఊస్ట్.. ఇది ఎక్కడంటే..!
Office Lunch Time: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు చాలా మంది తమ పని ఒత్తిడిలో భోజనానికి, నిద్రపోవడానికి సమయం కేటాయించేవారు కాదు.
Office Lunch Time: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు చాలా మంది తమ పని ఒత్తిడిలో భోజనానికి, నిద్రపోవడానికి సమయం కేటాయించేవారు కాదు. పనిచేస్తూనే ఏవో స్నాక్స్ తింటూ గడిపేసేవారు. ఒక్క సాఫ్ట్‌వేర్ సంస్థల్లోనే కాదు.. ఇప్పుడు చాలా ఆఫీసుల్లో ఇది కామన్ అయిపోయింది. పని చేస్తూనే భోజనం కూడా కానిచ్చేస్తున్నారు. అయితే ఇలా చేయడం ఓ యజమానికి నచ్చలేదు. ఈ పద్ధతిని ఎలాగైనా మార్చాలనుకున్నాడు. అంతే వెంటనే ఆ బాస్ ఏంచేసాడో తెలుసా.. ‘పనివేళల్లో తినడం నిషేధం’ అంటూ తన ఆఫీసుకు ఓ బోర్డు పెట్టేశాడు. అంతేనా అలా నిబంధన ఉల్లంఘించి ఎవరైనా ఆఫీసు టైంలో తింటూ కనిపిస్తే వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని, అలా చేసిన వారికి 1500 రూపాయలు బహుమతి కూడా ఇస్తారట. మూడుసార్లు నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగిని ఎలాంటి మినహాయింపులు ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తొలగిస్తారట.’ ఇదీ ఆ పోస్టర్‌లోని సారాంశం. తమ బాస్ ఆఫీసులో అంటించిన ఈ పోస్టర్‌ను ఓ ఉద్యోగి ఆన్‌లైన్‌లో షేర్‌చేశాడు. ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌ను చూసిన నెటిజన్లంతా ఆ బాస్‌పైన ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు.