AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Banking Units: 75 జిల్లాల్లో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు.. ప్రజలకు మరింత చేరువకానున్న సేవలు..

Digital Banking Units: రిజర్వు బ్యాంక్ దేశంలో ఆర్థిక సేవలను మరింత విస్తృతం చేసేందుకు త్వరలోనే డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లను(DBU) అందుబాటులోకి తెస్తోంది. ఈ సంవత్సరం జూలై నాటికి దేశం వ్యాప్తంగా 75 జిల్లాల్లో ప్రారంభంకానున్నాయి.

Digital Banking Units: 75 జిల్లాల్లో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు.. ప్రజలకు మరింత చేరువకానున్న సేవలు..
Digital Banking
Ayyappa Mamidi
|

Updated on: May 08, 2022 | 11:33 AM

Share

Digital Banking Units: రిజర్వు బ్యాంక్ దేశంలో ఆర్థిక సేవలను మరింత విస్తృతం చేసేందుకు త్వరలోనే డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లను(DBU) అందుబాటులోకి తెస్తోంది. ఈ సంవత్సరం జూలై నాటికి దేశం వ్యాప్తంగా 75 జిల్లాల్లో ప్రారంభంకానున్నాయి.. దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, 10 ప్రైవేట్‌ రంగ బ్యాంకులు(Private Banks), ఒక స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఈ దిశగా ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. డీబీయూల ఏర్పాటుకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఏప్రిల్ లోనే విడుదల చేసింది. ఆర్‌బీఐ ఫిన్‌టెక్‌ విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అజయ్‌ కుమార్‌ చౌదరి సారథ్యంలోని కమిటీ వీటిని రూపొందించింది. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ సీఈవో సునీల్‌ మెహతా నేతృత్వంలోని వర్కింగ్‌ గ్రూప్‌ కూడా తోడ్పాటు అందించింది. డీబీయూలను ఏర్పాటు చేసేందుకు అనువైన 75 జిల్లాల జాబితాను ఇప్పటికే రూపొందించింది. ఆర్‌బీఐ కమిటీ మార్గదర్శకాల ప్రకారం డీబీయూలను బ్యాంకింగ్‌ అవుట్‌లెట్లుగా పరిగణిస్తారు. ఇవి కనీస డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఉత్పత్తులు, లోన్స్, డిపాడిట్స్ వంటి సేవలను అందిస్తాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధిక సంఖ్యలో 12, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8, బ్యాంక్ ఆఫ్ బరోడా 7, కెనరా బ్యాంక్ 6, ఇండియా బ్యాంక్ 3 డీబీయూ యూనిట్లను ప్రారంభించనున్నాయి. IBA ప్రకారం ప్రైవేట్ రంగానికి చెందిన ICICI బ్యాంక్ 3, యాక్సిస్ బ్యాంక్ 3, HDFC బ్యాంక్ 2 DBUలను ఏర్పాటు చేస్తాయి.

ప్రయోగాత్మకంగా దేశంలో 75 జిల్లాల్లో డీబీయూలను ప్రారంభించటానికి ముందు పైలట్‌ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోంది. డీబీయూలను బ్యాంకింగ్‌ అవుట్‌లెట్లుగా ఏర్పాటు వల్ల బ్యాంకింగ్ సేవలు మరింత విస్తృతం అవటంతో పాటు సులభతరంగా మారతాయి. బ్యాంకులపై రద్దీ కూడా తగ్గుతుందని తెలుస్తోంది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా.. దేశంలోని 75 జిల్లాల్లో యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Income Tax: మారిన టాక్స్ రూల్స్ తెలుసుకోకపోతే నష్టపోతారు జాగ్రత్త..!

Foreign Journey: విదేశాలకు వెళ్లేవారు ఎంత భారత కరెన్సీ తీసుకెళ్లొచ్చో తెలుసా.. RBI పెట్టిన పరిమితి ఎంతంటే..