Fixed Deposits Interest: ఈ బ్యాంకులో మీరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తున్నారా..? మారిన వడ్డీ రేట్లు తెలుసుకోండి

Fixed Deposits Interest: ప్రస్తుతం అన్ని బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మార్చే్స్తున్నాయి. ఇక తాజాగా ఇండస్‌ఇండ్ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌ల కోసం FDలపై 7 శాతం..

Fixed Deposits Interest: ఈ బ్యాంకులో మీరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తున్నారా..? మారిన వడ్డీ రేట్లు తెలుసుకోండి
Follow us
Subhash Goud

|

Updated on: May 08, 2022 | 12:44 PM

Fixed Deposits Interest: ప్రస్తుతం అన్ని బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మార్చే్స్తున్నాయి. ఇక తాజాగా ఇండస్‌ఇండ్ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌ల కోసం FDలపై 7 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు హామీతో కూడిన రాబడితో అత్యంత రిస్క్ లేని, సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో ఒకటి. ఇది వృద్ధులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే పెట్టుబడి పథకాలలో ఒకటిగా చేస్తుంది. బ్యాంకులు సీనియర్ సిటిజన్‌లకు సాధారణ రేట్ల కంటే 50bps లేదా 0.5 శాతం అదనపు వడ్డీని అందిస్తాయి. ఒక సీనియర్ సిటిజన్ 2 సంవత్సరాల కంటే ఎక్కువ, 5 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధితో వారి FDలపై 7 శాతం వడ్డీని పొందవచ్చు. జనరల్ కేటగిరీ 6.50 శాతం రేటును పొందవచ్చు. ఈ వడ్డీ రేటు చాలా బ్యాంకులు అందించే దానికంటే ఎక్కువ. వివిధ కాల వ్యవధిలో రూ. 2 కోట్ల కంటే తక్కువ FDలపై IndusInd బ్యాంక్ అందించే వడ్డీ రేట్లు ఇక్కడ ఉన్నాయి.

☛ 7-14 రోజులు సాధారణ వ్యక్తులకు 2.75 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 3.25 శాతం

☛15-30 రోజులు – సాధరాణ కస్టమర్లకు 3 శాతం సీనియర్‌ సిటిజన్స్‌కు 3.50 శాతం

ఇవి కూడా చదవండి

☛ 31-45 రోజుల వరకు సాధారణ కస్టమర్లకు 3.25 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 3.75 శాతం

☛ 46-60 రోజుల వరకు సాధారణ కస్టమర్లకు 3.50 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 4.00 శాతం

☛ 61-90 రోజుల వరకు సాధారణ కస్టమర్లకు 3.75 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 4.25 శాతం

☛ 91-120 రోజుల వరకు సాధారణ కస్టమర్లకు 4.00 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 4.50 శాతం

☛ 121-180 రోజుల వరకు సాధారణ కస్టమర్లకు 4.50 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 5.00 శాతం

☛ 181-210 రోజుల వరకు సాధారణ కస్టమర్లకు 4.60 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 5.10 శాతం

☛ 211 రోజులు- సాధారణ కస్టమర్లకు 4.75 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 5.25 శాతం

☛ 270 రోజులు- సాధారణ కస్టమర్లకు 5.50 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 6.00 శాతం

☛ 355-364 రోజుల వరకు సాధారణ కస్టమర్లకు 5.50 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 6.00 శాతం

☛ 1 సంవత్సరం నుంచి 1సంవత్సరం 6 నెలల కంటే తక్కువ – సాధారణ కస్టమర్లకు 6.00 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌ 6.50 శాతం

☛ 1 సంవత్సరం 6 నెలల నుంచి 1 సంవత్సరం 7 నెలల కంటే తక్కువ సాధారణ కస్టమర్లకు 6.00 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 6.50 శాతం

☛ 2 సంవత్సరాల నుండి 2 సంవత్సరాల 6 నెలలు లోపు – సాధారణ కస్టమర్లకు 6.00 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 7.00 శాతం

☛ 2 సంవత్సరాల 8నెలల నుంచి 2 సంవత్సరాల 9 నెలల కంటే తక్కువ – సాధారణ కస్టమర్లకు 6.50 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 7.00 శాతం

☛ 2 సంవత్సరాల 9 నెలల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ – సాధారణ కస్టమర్లకు 6.50 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 7.00 శాతం

☛ 3 సంవత్సరాల నుంచి 61 నెలల కంటే తక్కువ- సాధారణ కస్టమర్లకు 6.50 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 7.00 శాతం

☛ 61 నెలలు, అంతకంటే ఎక్కువ – సాధారణ కస్టమర్లకు 6.00 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 6.50 శాతం

☛ ఇండస్ ట్యాక్స్‌ సేవర్‌ స్కీమ్‌ (5 సంవత్సరాలు) – సాధారణ కస్టమర్లకు 6.50 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 7.00 శాతం చొప్పున వడ్డీ రేట్లను నిర్ణయించింది బ్యాంకు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి