AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

e-Scooters: ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోవటానికి కారణం అదేనట.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు..

e-Scooters: గత కొంత కాలంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటలకు ఆహుతి కావటం, అమాంతం పేలిపోవటం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటికి అసలు కారణాలు ఏమిటో కనుక్కోవటానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

e-Scooters: ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోవటానికి కారణం అదేనట.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు..
Ola Scooters
Ayyappa Mamidi
|

Updated on: May 08, 2022 | 1:11 PM

Share

e-Scooters: గత కొంత కాలంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటలకు ఆహుతి కావటం, అమాంతం పేలిపోవటం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటికి అసలు కారణాలు ఏమిటో కనుక్కోవటానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి బ్యాటరీ సెల్స్, మాడ్యూల్స్ లోపభూయిష్టంగా ఉంటమేనని ప్రాథమిక ఫెడరల్ పరిశోధన ప్రకారం వెల్లడైనట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ఒక కథనంలో పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ తో సహా మూడు కంపెనీలకు సంబంధించిన ఈవీల అగ్నిప్రమాద ఘటనలపై ఫెడరల్ దర్యాప్తు పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఓలా ఎలక్ట్రిక్ ఏప్రిల్ 2022లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఈ-స్కూటర్ తయారీదారుగా ఉంది. ఓలా విషయంలో.. బ్యాటరీ సెల్‌తో పాటు బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో లోపాలు కూడా కారణంగా గుర్తించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు కోసం.. తదుపరి తనిఖీలు చేయడానికి ప్రభుత్వం మూడు కంపెనీల నుంచి బ్యాటరీల నమూనాలను తీసుకుంది. విచారణకు సంబంధించిన తుది నివేదిక రెండు వారాల్లో వెలువడనున్నట్లు సంబంధిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది.

దేశంలో ఈ-స్కూటర్లు, ఈ-బైక్‌లను 2030 నాటికి 2 శాతం నుంచి 80 శాతం మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో ఉండాలని ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకుంది. ఏదేమైనప్పటికీ.. భద్రతాపరమైన ఆందోళనలు వినియోగదారుల ఈవీలపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీశాయి. దేశంలో కర్బమ ఉద్గారాలను తగ్గించేందుకు ఈవీల వినియోగం పెంచాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సమస్యలను నివారించేందుకు, అసలు ఎలక్ట్రిక్ వాహనాల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలపై కేంద్రం రెండు నెలల క్రితం దర్యాప్తు ప్రారంభించింది. ఇదే సమయంలో ఓలా కూడా ఈ సమస్యపై ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. థర్డ్ పార్టీ ఏజెన్సీతో స్వంత విచారణ నిర్వహిస్తున్నట్లు ఓలా వెల్లడించింది. LG ఎనర్జీ సొల్యూషన్స్ (LGES) అనే దక్షిణ కొరియా కంపెనీ నుంచి ఓలా తన ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన బ్యాటరీలను కొనుగోలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Interest Rates: వినియోగదారులకు అలర్ట్.. వడ్డీ రేట్లు మార్పు చేసిన ఆ రెండు బ్యాంకులు..

Google Pay Loan: గూగుల్ పే నుంచి లక్ష వరకు పర్సనల్ లోన్.. సులువుగా ఇలా పొందండి..