Credit Card: క్లెడిట్ కార్డ్ క్లోజ్ చేసుకుంటే ఇన్ని నష్టాలా.. ఎఫెక్ట్ ఏడేళ్లు ఉంటుందంట.. జాగ్రత్త..

Credit Card: బ్యాంకులో ఎలాంటి లోన్స్ తీసుకోవాలన్నా సిబిల్ స్కోర్(CIBIL Score) చాలా ముఖ్యమైనది. ఇది గనుక తక్కువగా ఉన్నట్లయితే లోన్స్ తీసుకోవటం కష్టం అవటమే కాక అధిక వడ్డీ రేటు విధిస్తుంటారు.

Credit Card: క్లెడిట్ కార్డ్ క్లోజ్ చేసుకుంటే ఇన్ని నష్టాలా.. ఎఫెక్ట్ ఏడేళ్లు ఉంటుందంట.. జాగ్రత్త..
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 08, 2022 | 7:54 AM

Credit Card: బ్యాంకులో ఎలాంటి లోన్స్ తీసుకోవాలన్నా సిబిల్ స్కోర్(CIBIL Score) చాలా ముఖ్యమైనది. ఇది గనుక తక్కువగా ఉన్నట్లయితే లోన్స్ తీసుకోవటం కష్టం అవటమే కాక అధిక వడ్డీ రేటు విధిస్తుంటారు. అయితే క్రెడిట్ కార్డులను రద్దు చేసుకుంటే క్రెడిట్ స్కోరు కూడా దెబ్బతింటుందని మీకు తెలుసా. చాలా మంది తామకు క్రెడిట్ కార్డ్ అవసరం లేదని, ఛార్జీలు ఎక్కువగా ఉంటున్నాయని లేదా ఇంకేమైనా ఇతర కారణాల వల్ల తమ క్రెడిట్ కార్డులను రద్దు చేసుకుంటుంటారు. ఇలా చేయటం వల్ల సదరు వ్యక్తుల క్రెడిట్ స్కోర్ భారీగా దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. అలాగని క్రెడిట్ కార్డును రద్దు చేసుకోవద్దనీ వాళ్లు చెప్పట్లేదు. కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి అని సూచిస్తున్నారు.

క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉన్న కార్డులను రద్దు చేసుకుంటే క్రెడిట్ స్కోరుపై ప్రభావం భారీగానే ఉంటుంది. క్రెడిట్ లిమిట్ లో ఎంత వాడుకున్నారనేదీ ఎఫెక్ట్ కు కారణమవుతుంది. ఒక్కో కార్డువారీగా లేదా ఉన్న మొత్తం కార్డుల వారీగానూ దానిని లెక్కిస్తారు. ఉన్న మొత్తం క్రెడిట్ లిమిట్ లో 30 శాతం కన్నా తక్కువ వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటుందని వారు సూచిస్తున్నారు. ఎక్కువ క్రెడిట్ స్కోర్లున్నవారు 10 శాతం కన్నా తక్కువ లిమిట్ ను వాడుకుంటున్నవాళ్లేనని తెలుస్తోంది. ఎంత కాలం నుంచి క్రెడిట్ కార్డు వాడుతున్నారన్న దానిపైనా క్రెడిట్ స్కోరు ఆధారపడి ఉంటుంది. ఒక క్రెడిట్ కార్డును క్లోజ్ చేసేస్తే పాత హిస్టరీ అంతా పోతుంది. అంటే రుణాలు ఇచ్చే సమయంలో ఇంతకుముందున్న వాటినీ చూస్తారు కాబట్టి.. క్రెడిట్ కార్డును క్లోజ్ చేస్తే ఆ పాత వివరాలేవీ ఉండే చాన్స్ ఉండదు. క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసినప్పుడు ఏవైనా బకాయిలుంటే.. దాని ప్రభావం 5 నుంచి 7 ఏళ్ల పాటు ఉంటుంది. క్రెడిట్ కార్డును క్లోజ్ చేసినా మంచి స్కోరు రావాలంటే.. కొన్ని నెలల పాటు ఎప్పటికప్పుడు చెల్లింపులను చేస్తూ ఉండాలి.

క్రెడిట్ రిపోర్టులో కార్డుకు ఎక్కువ హిస్టరీ ఉంటే రద్దు చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. క్రెడిట్ అకౌంట్లు తక్కువగా ఉన్నప్పుడు కార్డును రద్దు చేయడం వల్ల స్కోరు తగ్గే ప్రమాదం ఉంటుంది. పెద్దగా వాడడం లేదని అస్సలు రద్దు చేసుకోవద్దు. ఒకవేళ కార్డును రద్దు చేసుకోవాలనుకుంటే దానికి ఉన్న బకాయిలన్నింటినీ తప్పనిసరిగా చెల్లించాల్సిందే. కార్డు మీద ఆటోమేటిక్ పేమెంట్స్ ఉంటే వాటిని రద్దు చేసుకోవాలి. కార్డు మీద ఉన్న పాయింట్లన్నింటినీ రిడీమ్ చేసుకోవడం మరచిపోవద్దు. కొన్ని సంస్థలు రిడీమ్ చేసుకునే పాయింట్ల ద్వారా చెల్లింపులకు అవకాశమిస్తుంటాయి. కార్డును రద్దు చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని కస్టమర్ కేర్ ద్వారా తెలియజేయాలి. క్లోజ్ అయినట్టు మెయిల్ ద్వారా కన్ఫర్మ్ చేయమని రిక్వెస్ట్ చేయాలి. కార్డు రద్దు అయిన తర్వాత ముక్కలు చేసి పారేయాలి.

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి..

Anand Mahindra: తన ఉద్యోగం ఊడుతుందంటున్న ఆనంద్ మహీంద్రా.. ఎందుకో తెలుసా..!

IPO News: 60% పతనమైన Nykaa, Paytm, Zomato విలువ.. ఇన్వెస్టర్ల భవిష్యత్తు బంగారమేనట ఎందుకంటే..!