LPG Cylinder Price: పెరుగుతున్న ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ ధరలు.. ఏడాదిలో ఎంత పెరిగిందంటే..!

LPG Cylinder Price: చమురు సంస్థలు గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు భారం మోపుతున్నాయి. తాజాగా శనివారం ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50 వరకు పెరిగింది. దీంతో సబ్సిడీయేతర ..

LPG Cylinder Price: పెరుగుతున్న ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ ధరలు.. ఏడాదిలో ఎంత పెరిగిందంటే..!
Gas Cylinder
Follow us
Subhash Goud

|

Updated on: May 08, 2022 | 1:20 PM

LPG Cylinder Price: చమురు సంస్థలు గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు భారం మోపుతున్నాయి. తాజాగా శనివారం ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50 వరకు పెరిగింది. దీంతో సబ్సిడీయేతర వంట గ్యాస్‌ (Gas) (14.2కిలోల) సిలిండర్‌ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.949.50 నుంచి రూ.999.50 వరకు పెరిగింది. ఇక గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి వంట గ్యాస్‌పై రూ.190 పెరిగింది. 2022లో మార్చి 22న రూ.50 పెరిగింది. నెల రోజులుగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు నిలకడగా కొనసాగుతున్నాయి. మార్చి 22 నుంచి 16 రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.10 చొప్పున లీట‌ర్ పెట్రోల్ / లీట‌ర్ డీజిల్ ధ‌ర పెరిగింది. ప్రస్తుతం సంవత్సరానికి 12 స‌బ్సిడీ సిలిండర్లు పూర్తయితే ప్రతిఒ్కరూ స‌బ్సిడీయేత‌ర వంట గ్యాస్ సిలిండ‌ర్ కొనుకోగులు చేయాల్సి ఉంటుంది.

అయితే దేశంలోని దాదాపు అన్ని న‌గ‌రాల్లో ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లపై ప్రభుత్వం సబ్సిడీ చెల్లించడం లేదు. కేంద్ర సర్కార్‌ ప్రతితిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పేద మహిళలకు ఉజ్వల ప‌థ‌కం కింద ఉచిత గ్యాస్ క‌నెక్షన్ కింద కూడా స‌బ్సిడీ చెల్లించ‌డం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలలో సబ్సిడీయేతర వంట గ్యాస్‌ సిలిండ‌ర్ ధ‌ర రూ.999.50 అయితే, చెన్నైలో రూ.1015.50, కోల్‌క‌తాలో రూ.1026 ఉంది. రాష్ట్రాల వారీగా వ్యాట్ ధ‌ర‌ల్లో తేడా ఉండ‌టం వ‌ల్ల ధ‌ర‌ విషయాల్లో కూడా తేడాలు ఉంటాయి. ఈ నెల ప్రారంభంలో వాణిజ్య సిలిండ‌ర్లపై రూ.102.50 పెంచింది చమురు కంపెనీ. దీంతో వాణిజ్య వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.2,355.50ల‌కు పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి