AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. ఆయన చేసిన పనికి నెట్టిజన్లు ఫిదా..

Anand Mahindra: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మాటిచ్చారంటే చేస్తారంటే. తమిళనాడులో ఎనిమిది పదుల వయసులోనూ అందరి ఆకలి తీర్చేందుకు కేవలం రూపాయికే ఇడ్లీలు అమ్ముతున్న ‘ఇడ్లీ బామ్మ’(Idli Amma) కమలాత్తాళ్‌ గుర్తుంది మీరు వినే ఉంటారు.

Anand Mahindra: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. ఆయన చేసిన పనికి నెట్టిజన్లు ఫిదా..
Anand Mahindra
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 09, 2022 | 6:35 AM

Anand Mahindra: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మాటిచ్చారంటే చేస్తారంటే. తమిళనాడులో ఎనిమిది పదుల వయసులోనూ అందరి ఆకలి తీర్చేందుకు కేవలం రూపాయికే ఇడ్లీలు అమ్ముతున్న ‘ఇడ్లీ బామ్మ’(Idli Amma) కమలాత్తాళ్‌ గుర్తుంది మీరు వినే ఉంటారు. ఆమెకు సొంత ఇంటిని నిర్మించి ఇస్తామని వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా గతంలో ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. మాతృదినోత్సవం రోజున ఆయన తన మాట నిలబెట్టుకుంటూ.. ఆమెకు కొత్త ఇంటిని కానుకగా అందజేశారు. గృహ ప్రవేశానికి సంబంధించిన దృశ్యాలతో పాటు.. గతంలో చేసిన ట్వీట్‌లు, ఇంటి నిర్మాణ పనులతో కూడిన వీడియోను ఆదివారం ట్విట్టర్‌లో షేర్ చేశారు. మాతృ దినోత్సవం(Mothers day) నాటికి ‘ఇడ్లీ అమ్మ’కు సొంత ఇంటిని బహుమతిగా అందించేందుకు సకాలంలో పనులు పూర్తి చేసిన తమ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆమె.. నిస్వార్థం, దయ తదితర మాతృత్వ సద్గుణాల స్వరూపం. అమ్మకు, ఆమె పనికి మద్దతు ఇవ్వడం గొప్పగా భావిస్తున్నాం. అందరికీ హ్యాపీ మదర్స్‌ డే’ అంటూ మహీంద్రా ట్వీట్‌ చేశారు.

తమిళనాడులోని వడివెలంపాలయం గ్రామానికి చెందిన కమలాత్తాళ్‌ 37 ఏళ్లుగా రూపాయికే నాలుగు ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తున్నారు. ఈ ఇడ్లీ బామ్మ గురించి 2019లో ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేయడంతో అప్పట్లో ఆమె ఇంటర్నెట్ లో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆమెకు సాయం చేయడానికి ముందుకొచ్చిన మహీంద్రా.. వంటగ్యాస్‌కు అయ్యే ఖర్చును భరిస్తామని మాటిచ్చారు. మరో సందర్భంలో.. కమలాత్తాళ్‌కు త్వరలోనే కొత్త ఇంటిని నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఆయన తాను ఇచ్చిన మాటను కూడా నెరవేర్చారు. మరోవైపు.. మహీంద్రాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మీకు సెల్యూట్‌. మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే గర్వపడేలా చేయాల’ని ఓ నెటిజన్‌ ట్వీట్ కు బదులిచ్చారు. మదర్స్‌ డే రోజు ఇడ్లీ అమ్మ ఆశీస్సులు పొందడం.. దేవుడి ఆశీస్సులు పొందడం లాంటిదేనని మరొకరు కామెంట్‌ పెట్టారు. ఇలా చాలా మంది మహీంద్రా చేసిన పనిని ప్రశంశిస్తున్నారు.

ఇవీ చదవండి:

Sri Lanka Crisis: శ్రీలంకలో ఆందోళనలు మరింత ఉధృతం.. రాజపక్సే ఆఫర్‌ను తిరస్కరించిన ప్రేమదాస

Kidney Care Tips: కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ రసం తాగితే వెంటనే చెక్ పెట్టొచ్చు..