Gold, Silver Price Today: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
Gold, Silver Price Today: బంగారం, వెండి ధరలు ప్రతి రోజు మార్పులు జరుగుతుంటాయి. దేశంలో ఉక్రెయిన్-రష్యా దాడుల తర్వాత ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ..
Gold, Silver Price Today: బంగారం, వెండి ధరలు ప్రతి రోజు మార్పులు జరుగుతుంటాయి. దేశంలో ఉక్రెయిన్-రష్యా దాడుల తర్వాత ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం దిగి వస్తున్నాయి. నిన్న తులం బంగారంపై 400 పెరుగగా, తాజాగా మే 9న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ (International Market) పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,770, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,200 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,710 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద స్థిరంగా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.51,710. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 ఉంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద ఉంది.
వెండి ధరలు:
బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. ఈ రోజులు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ.66,800 ఉండగా, ముంబైలో రూ.62,500 వద్ద ఉంది. ఢిల్లీ కిలో వెండి ధర రూ.62,500 ఉండగా, కోల్‌కతాలో రూ.62,500 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.66,800 ఉండగా, హైదరాబాద్‌లో రూ.66,800 ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ.66,800 ఉండగా, విజయవాడలో రూ.66,800 ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి