Fire Accident: ఇండోర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్‌.. సీసీ ఫుటేజ్ చూసి పోలీసులు షాక్

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌లోని ఓ రెండతస్తుల భవనంలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ ట్విస్ట్ వెలుగుచూసింది.

Fire Accident: ఇండోర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్‌.. సీసీ ఫుటేజ్ చూసి పోలీసులు షాక్
Fire Accident
Follow us
Ram Naramaneni

|

Updated on: May 08, 2022 | 3:16 PM

Indore building fire: శనివారం మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో షాకింగ్‌ ట్విస్ట్‌ బయటికొచ్చింది. యువతి తనతో పెళ్లికి నిరాకరించిందనే కోపంతో..బిల్డింగ్‌ పార్కింగ్‌లో ఉన్న బైక్‌కు నిప్పంటించాడు ఓ యువకుడు. ఆ మంటలు పార్కింగ్‌ నుంచి పై అంతస్తులకూ వ్యాపించి ఏడుగురు సజీవ దహనమయ్యారు. అతని ఉన్మాదానికి ఏడుగురు అమాయకులు బలయ్యారు. మరోవైపు మంటలు చూసి భయంతో భవనం పైనుంచి కిందకు దూకిన మరో 9మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముందు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు భావించారు. కానీ ఆ తర్వాతే తెలిసింది అసలు విషయం. సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఆమె ఉంటున్న బిల్డింగ్‌కే నిప్పుపెట్టాడా యువకుడు.

ఝాన్సీకి చెందిన నిందితుడు దీక్షిత్‌..6 నెలల క్రితం ఇదే ఇంట్లో రెంట్‌కు ఉండేవాడని తెలిపారు పోలీసులు. ఆ సమయంలో అదే బిల్డింగ్‌లో ఉన్న ఓ యువతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడని..అందుకు ఆమె నిరాకరించడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు వెల్లడించారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Asani Cyclone: దూసుకువస్తున్న ‘అసని’.. ఏపీకి భారీ వర్ష సూచన.. అధికారులు అలెర్ట్