Asani Cyclone: దూసుకువస్తున్న ‘అసని’.. ఏపీకి భారీ వర్ష సూచన.. అధికారులు అలెర్ట్
ఆగ్నేయ బంగాళాఖాతంలో అసానీ తుఫాన్ ఏర్పడింది. ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రకటించారు.
AP Weather: ఏపీకి భారీ రెయిన్ అలెర్ట్ వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ‘అసని’ అని పేరు పెట్టారు. అసని తుపాను ఏపీ సహా దేశంలోని పలు రాష్ట్రాలపై ప్రభావం చూపించనుంది. గంటకు 16 కి.మీ వేగంతో కదులుతున్న అసని తుఫాను విశాఖపట్నంకు ఆగ్నేయంగా 970 కి.మీ దూరంలో ఉంది. ఒడిశా పూరీకి 1030 కి.మీ దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్యదిశగా కదులుతున్న ఈ అసని తుఫాను రాబోయే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారనుందని వివరించారు. ఆదివారం సాయంత్రం వరకు సాధారణ తుపాను గానే ఉంటుందని.. సోమవారానికి తీవ్రమైన తుపానుగా మారే అవకాశం ఉందని వాతవారణ శాఖ అంచనా వేస్తుంది. మే 10న ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతంలో ఇది బలహీన పడే చాన్స్ ఉందని తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి ఒడిశా, ఏపీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాన్ ఎఫెక్ట్‌తో నేటి అర్థరాత్రి నుంచి గంటకు 105 నుంచి 125 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి. తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాన్ నేపథ్యంలో అధికారులు అలెర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ పరిస్థితులను మోనిటర్ చేస్తున్నారు.
12th May: Light to moderate rainfall likely at a few places with heavy rainfall at isolated places is likely over coastal areas of Odisha and West Bengal.
— India Meteorological Department (@Indiametdept) May 8, 2022
Also Read: Viral: ఇంట్లోని పెరట్లో నక్కిన సింహం.. సమాచారంతో అధికారులు హైఅలెర్ట్.. చివరకు తుస్