Taj Mahal: తాజ్‌మహల్‌లోని ఆ గదులను తెరవండి.. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్..

తాజ్‌మహల్‌లో తాళం వేసి ఉన్న 22 గదులను తెరవాలని.. వాటిపై ఏఎస్‌ఐతో విచారణ జరిపించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. వాటిలోని హిందూ దేవుళ్ల విగ్రహాలు, శాసనాలు ఉన్నాయేమో తెలుసుకోవాలని..

Taj Mahal: తాజ్‌మహల్‌లోని ఆ గదులను తెరవండి.. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్..
Taj Mahal
Follow us
Sanjay Kasula

|

Updated on: May 08, 2022 | 4:45 PM

తాజ్‌మహల్‌లో(Taj Mahal) తాళం వేసి ఉన్న 22 గదులను తెరవాలని.. వాటిపై ఏఎస్‌ఐతో విచారణ జరిపించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. వాటిలోని హిందూ దేవుళ్ల విగ్రహాలు, శాసనాలు ఉన్నాయేమో తెలుసుకోవాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించాలని పిటిషన్ దాఖలైంది. బీజేపీ అయోధ్య మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్ రజనీశ్ సింగ్ అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనంలో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. తాజ్ మహల్‌లోని ఈ గదులను మూసివేయడానికి కారణమేమిటని ASIకు చెందిన వ్యక్తులను అడిగాను, అసలు కారణం ఏమిటని తాను సాంస్కృతిక మంత్రిత్వ శాఖను కూడా అడిగినట్లుగా వెల్లడించారు. అయితే వారు సమాధానం మరోలా ఉంది. కేవలం భద్రతా కారణాల దృష్ట్యా వాటిని మూసివేసినట్లు చెప్పారు. ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరినట్లు తెలిపారు. ఈ గదులను తెరచి వాటిలో ఏం ఉందో తెలుసుకుంటే వివాదాలు పరిష్కారమవుతాయని, దీనివల్ల ఎటువంటి హాని జరగబోదని అన్నారు.

ఎవరి ఆదేశాల మేరకు గదులు మూసివేశారు?

దీనిపై పిటిషనర్ మరిన్ని వివరాలను ప్రశ్నించారు. “ఎవరి ఆదేశంతో వాటిని మూసివేశారు? వారి వైపు నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదు. ఆ తర్వాత నేను ఈ పిటిషన్ వేశానని అడిగాడు. తాజ్ మహల్ చిన్న ప్రదేశమేమీ కాదు.. ఈ గదులను ఎందుకు మూసివేశారో సమాధానం చెప్పాలని అన్నారు. ఈ గదుల వల్ల తాజ్ మహల్ కు సంబంధించి తరచూ వివాదాలు తలెత్తుతున్నాయన్నారు.

ఇవి కూడా చదవండి

జాతీయ వర్తల కోసం..

ఇవి కూడా చదవండి: Viral Video: భార్య షాపింగ్ పిచ్చిని ఆధారాలతో సహా నిరూపించిన భర్త.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..

Badrinath Dham: చార్‌ధామ్ యాత్రలో చివరి పుణ్యస్థలం బద్రీనాథ్.. నేడు బ్రహ్మమూర్తంలో తెరుచుకున్న ఆలయ తలుపులు..