Badrinath Dham: చార్‌ధామ్ యాత్రలో చివరి పుణ్యస్థలం బద్రీనాథ్.. నేడు బ్రహ్మమూర్తంలో తెరుచుకున్న ఆలయ తలుపులు..

చార్ ధామ్ యాత్రలో చివరి ముఖ్యమైన బద్రీనాథ్ ఆలయం. ఈరోజు ఉదయం 6:15 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో తెరవబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను పూలతో అందంగా అలంకరించారు.

Badrinath Dham: చార్‌ధామ్ యాత్రలో చివరి పుణ్యస్థలం బద్రీనాథ్.. నేడు బ్రహ్మమూర్తంలో తెరుచుకున్న ఆలయ తలుపులు..
Badrinath Dham Open
Follow us
Surya Kala

|

Updated on: May 08, 2022 | 11:43 AM

Badrinath Dham: ఉత్తరాఖండ్‌లో(Uttarakhand) చార్ ధామ్ (Char Dham) యాత్ర కొనసాగుతోంది. చార్ ధామ్ యాత్రలో చివరి ముఖ్యమైన బద్రీనాథ్ ఆలయం. ఆదివారం ఉదయం బ్రహ్మ ముహూర్తం సమయంలో బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి. వేసవిలో భక్తుల దర్శనార్ధం.. బద్రీనాథ్ ఆలయ తలుపులు ఈరోజు ఉదయం 6:15 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో తెరవబడ్డాయి. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో బద్రీనాథ్ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పరిసరాలను  సుమారు 20 క్వింటాళ్ల పువ్వలతో అలంకరించగా.. విద్యుత్‌ దీపాల వెలుగుల్లో ఆలయం కాంతులీనింది. వచ్చే ఆరు నెలల పాటు భక్తులు ఆలయంలో బద్రీనాథ్ స్వామిని దర్శించుకోగలరు. ఈ ఉదయం బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరవగానే ఆలయం జై బద్రీనాథ్ నినాదాలతో మారుమోగింది. మంత్రోచ్ఛారణలతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తితో నిండి పోయాయి. ఈరోజు ఆలయ తలుపులు తెరిచే ముందు స్వామివారి ఖజానాకు పూజలు నిర్వహించారు.

మే 3 నుంచి ప్రారంభమైన చార్ ధామ్ యాత్ర 

మే 3న గంగోత్రి , యమునోత్రి ధామ్ తలుపులు తెరవడంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 6వ తేదీ శుక్రవారం ఉదయం 6.15 గంటలకు కేదార్‌నాథ్ ధామ్ తలుపులు భక్తుల కోసం తెరవబడ్డాయి. ఈసారి భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం చార్ ధామ్‌కు వెళ్లే రోజువారీ భక్తుల సంఖ్యను పరిమితిని నిర్ణయించింది. బద్రీనాథ్‌లో రోజుకు 15,000 మంది, కేదార్‌నాథ్‌లో 12,000, గంగోత్రిలో 7,000, యమునోత్రిలో 4,000 మంది యాత్రికులకు అనుమతి ఇచ్చారు. 45 రోజుల పాటు ఈ ఏర్పాట్లు చేశారు. కరోనా మహమ్మారి ప్రారంభమై సుమారు రెండు సంవత్సరాల తరువాత చార్ ధామ్ యాత్రలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌లకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!