Viral Video: చిన్నారి కాదు.. చిచ్చరపిడుగు.. విన్యాసాలు చూస్తే చెమటలు పట్టాల్సిందే.. షాకింగ్ వీడియో

ప్రతిభ ఆధారంగా.. చిన్నారులు ప్రపంచంలో తమకంటూ ఓ పేరును సంపాదించుకుంటుంటారు. పాటయినా.. డ్యాన్స్ అయినా.. ఏదైనా స్టంట్ అయినా.. ఇప్పుడు పిల్లలు హాయిగా చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు..

Viral Video: చిన్నారి కాదు.. చిచ్చరపిడుగు.. విన్యాసాలు చూస్తే చెమటలు పట్టాల్సిందే.. షాకింగ్ వీడియో
Talented Kids Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 08, 2022 | 2:52 PM

Little girl amazing stunt video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజాగా.. ఓ చిన్నారికి సంబంధించిన స్టంట్ వైరల్ అవుతోంది. సాధారణంగా చిన్నపిల్లలు అచ్చం పెద్ద వాళ్లలాగా వ్యవహరిస్తుంటారు. రికార్డులు సృష్టించడానికి.. విజయం సాధించడానికి వయస్సుతో సంబంధం లేదని నిరూపిస్తుంటారు. చిన్నవయసులో ఇలాంటి విన్యాసాలు చేస్తుంటే జనాలు చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా.. ఇది ఎవరికి సాధ్యం కాదంటూ కితాబిస్తుంటారు. పెద్దలు చేయలేని పనులు.. పిల్లలు చేయడం అమేజింగ్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా వారి ప్రతిభ ఆధారంగా.. చిన్నారులు ప్రపంచంలో తమకంటూ ఓ పేరును సంపాదించుకుంటుంటారు. పాటయినా.. డ్యాన్స్ అయినా.. ఏదైనా స్టంట్ అయినా.. ఇప్పుడు పిల్లలు హాయిగా చేస్తున్నారు. ఇలాంటి అనేక వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇందులో పిల్లల ప్రతిభ అద్భుతంగా ఉంటుంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ చిన్నారి అద్భుతమైన విన్యాసాలు చేస్తూ కనిపించింది. వీడియోలో మీరు అమ్మాయి అద్భుతమైన బ్యాక్‌ఫ్లిప్ విన్యాసాన్ని చూడవచ్చు. ఇందులో పెద్దవాళ్ళకి చెమటలు పడుతున్నప్పటికీ.. అమ్మాయి మాత్రం హాయిగా చేస్తోంది. రెండవ సన్నివేశంలో గాలిలో బ్యాక్‌ఫ్లిప్‌ను కొట్టేటప్పుడు అమ్మాయి ఒక వ్యక్తి చేతులపై నిటారుగా నిలబడటం కనిపిస్తుంది. ఇలా చేయడం అందరికీ సాధ్యం కాదు. అలా చేయాలంటే కనీసం ఏళ్లపాటు కఠినమైన సాధన చేయాలి. ఇంత చిన్న వయసులో ఆ అమ్మాయి ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటుందో ఇప్పుడు మీరు ఊహించవచ్చు.

వైరల్ వీడియో..

ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో యువర్ అడ్వెంచర్‌గ్రామ్ అనే యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షా 60 వేలకు పైగా వీక్షించగా.. 4 వేల మందికి పైగా లైక్ చేసారు. అదే సమయంలో వీడియో చూసిన తర్వాత చాలా మంది నెటిజన్లు అమేజింగ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంత చిన్న వయస్సులో ఇటువంటి ఫీట్… ఖచ్చితంగా అద్భుతం అంటూ కితాబిస్తున్నారు.

Also Read:

Viral Video: తగ్గేదేలే.. మొసలి వర్సెస్ ఫైథాన్.. పోటాపోటీ పోరులో నిలిచిందెవరు.. గెలిచిందెవరు..

Viral Video: ఈ కుక్క చాలా షార్ప్.. ఏకంగా ట్రక్‌నే నడుపుతోంది.. వీడియో చూస్తే షాక్ అవుతారు..!

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే