Viral Video: తగ్గేదేలే.. మొసలి వర్సెస్ ఫైథాన్.. పోటాపోటీ పోరులో నిలిచిందెవరు.. గెలిచిందెవరు..

మొసలి.. అనకొండకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మొసలి తన నోటితో పెద్ద కొండచిలువను రెండు ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తోంది.

Viral Video: తగ్గేదేలే.. మొసలి వర్సెస్ ఫైథాన్.. పోటాపోటీ పోరులో నిలిచిందెవరు.. గెలిచిందెవరు..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 07, 2022 | 9:49 PM

Alligator – Python Fighting Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా ఓ మొసలి.. అనకొండకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మొసలి తన నోటితో పెద్ద కొండచిలువను రెండు ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తోంది. దీన్ని చూసి సోషల్ మీడియా యూజర్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. వామ్మో.. మొసలి భారీ అనకొండను నొట ఎలా పట్టుకుంది అంటూ పేర్కొంటున్నారు. ఈ వీడియోను యానిమల్స్ ఎనర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనిని ఇప్పటివరకు 10వేలకు పైగా లైక్‌ చేయగా.. 4.5 లక్షల మంది వీక్షించారు.

వైరల్ వీడియోలో.. కొండచిలువను మొసలి తన పళ్తతో గట్టిగా పట్టుకుంది. ఈ క్రమంలో కొండచిలువ మొసలి శరీరాన్ని చుట్టుకొని కాటు వేయడానికి ప్రయత్నిస్తుండటాన్ని వీడియోలో చూడవచ్చు. అయితే మొసలి కొండచిలువను రెండుగా వేరు చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో కొండచిలువ కూడా ప్రతిఘటిస్తుంది. మొసలిపై దాడి చేయడంతో.. అది పట్టుసడలిస్తుంది. దీంతో కొండచిలువ మొసలి బారి నుంచి తప్పించుకుంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

కాగా.. మొసలి, కొండచిలువ రెండూ ఒకే సరీసృపాల కుటుంబానికి చెందినవి. వీడియోలో రెండూ కూడా తగ్గేందుకు సిద్ధంగా కనిపించడం లేదు. ప్రమాదకరమైన రీతిలో రెండు పొట్లాడుకోని.. చివరకు రెండు కూడా ఒకదానికొకటి దూరంగా వెళతాయి.

అయితే.. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మొసలి కొండచిలువను రెండు ముక్కలుగా చేస్తుందని అనుకున్నామని.. కానీ.. అలా జరగలేదని.. ఫైథాన్ పోరాటం వృథా కాలేదంటూ పేర్కొంటున్నారు.

ఈ ఫైట్‌ చూస్తుంటే నిజంగా థ్రిల్‌గా ఉందని పేర్కొంటున్నారు. డెవిల్ vs డెవిల్.. వీడియో బాగుందంటూ పేర్కొ్ంటున్నారు నెటిజనం..

మరిన్ని ట్రెండింగ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Viral News: ఈద్‌ పార్టీకి పిలిస్తే.. బిర్యానీతో పాటు నెక్లెస్‌ మింగేశాడు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్..

Viral Video: నది వంతెనపై ఆగిన రైలు.. ప్రాణాలను పణంగా పెట్టిన లోకో పైలట్‌.. షాకింగ్ వీడియో..!