Hyderabad Water Supply: హైదరాబాద్లోని గండిపేట కాండ్యూట్లో లీకేజీల మరమ్మత్తుల నిమిత్తం నవంబర్ 3 ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 4 సాయంత్రం 6 గంటల వరకు 36 గంటల పాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది. జలమండలి పనుల వల్ల గోషామహల్, టోలిచౌకి, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల వినియోగదారులు నీటిని నిల్వ చేసుకోవాలని కోరింది.