వామ్మో.. ఇంత పెద్ద కొండ చిలువా..? కోయంబత్తూరు సమీపంలో కలకలం

×

వామ్మో.. ఇంత పెద్ద కొండ చిలువా..? కోయంబత్తూరు సమీపంలో కలకలం

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా ఓణంపాళయం ప్రాంతంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. స్థానిక నివాస ప్రాంతంలోకి ప్రవేశించిన సుమారు 10 అడుగుల పొడవైన గాయపడిన కొండచిలువను పాములు పట్టే నిపుణుడు సురక్షితంగా పట్టుకుని రక్షించాడు.  అయితే, పామును రక్షించేందుకు అటవీ శాఖను సంప్రదించగా, వారి ఫోన్ నంబర్లు పనిచేయకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. అటవీ శాఖ స్పందనపై విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Janardhan Veluru