Teeth Remedies: దంతాలు పసుపు కలర్‌లో ఉన్నాయని బాధపడుతున్నారా..? ఇలా చేస్తే తెల్లగా మెరిసిపోతాయ్..

దంతాలు పసుపు పచ్చగా మారి ఇబ్బంది పడుతుంటే.. తెల్లగా మార్చేందుకు ఇంటి చిట్కాలను అనుసరించాలని సూచిస్తున్నారు.

Teeth Remedies: దంతాలు పసుపు కలర్‌లో ఉన్నాయని బాధపడుతున్నారా..? ఇలా చేస్తే తెల్లగా మెరిసిపోతాయ్..
Teeth Whitening
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 07, 2022 | 5:50 PM

Teeth Whitening Tips: ఇటీవల కాలంలో చాలామంది దంత సమస్యలను ఎదుర్కొంటున్నారు. శరీర సౌందర్యంలో దంతాలు కూడా ఒక భాగం. వాస్తవానికి మెరిసే తెల్లటి దంతాలు ఉంటే.. వేరే వ్యక్తులకు త్వరగా ఆకర్షితులవుతారు. దీంతోపాటు ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త వ్యక్తులను కూడా త్వరగా పలకరించవచ్చు. ఇతరులపై మనం ప్రభావితం చేసే అంశాలలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వస్త్రధారణలో మేకప్‌లాగా ఇది కూడా ఒక భాగం అని సౌందర్య నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. దంతాలు పసుపు పచ్చగా మారి ఇబ్బంది పడుతుంటే.. తెల్లగా మార్చేందుకు ఇంటి చిట్కాలను అనుసరించాలని సూచిస్తున్నారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

  • వంట సోడా: బేకింగ్ సోడా లేదా బైకార్బోనేట్ ఆఫ్ సోడా పళ్లను తెల్లగా చేయడానికి ఉపయోగించవచ్చు. ఇది తేలికపాటి రాపిడి ప్రభావాన్ని కలిగి ఉండి.. దంతాల మీద మరకలను తొలగిస్తుంది. ఇది టూత్ పౌడర్ లాగా ఉపయోగించవచ్చు. అయితే.. బేకింగ్ సోడా తీసుకోని దంతాల మీద ఒక నిమిషం పాటు అప్లై చేయాలి. ఆ తర్వాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. బేకింగ్ సోడాలో కొంచెం నిమ్మరసం వేసి కలిపి బ్రష్ చేస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే నిమ్మరసం తేలికపాటి బ్లీచింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
  • కొబ్బరి నూనె పుల్లింగ్: ఇది ఒక పురాతన ఆయుర్వేద ఔషధం. ఇది దంతాలను శుభ్రపరచడానికి. తెల్లగా చేయడానికి మాత్రమే కాకుండా శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి కూడా ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె లేదా ఏదైనా కూరగాయల నూనెతో దీనిని చేయవచ్చు. ఒక టేబుల్ స్పూన్ నూనెను నోటిలోకి తీసుకొని పుల్లింగ్ చేయండి. దాదాపు 15 నిమిషాలపాటు ఇలా చేయాలి. దీంతో నూనె లాలాజలంతో కలుస్తుంది.. ఇది స్విర్లింగ్ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఆ తర్వాత ఇది దంతాల మధ్య రక్తప్రవాహాన్ని మెరుగుపర్చి విషాన్ని బయటకు పంపుతుంది. అనంతరం నూనెను ఉమ్మివేయండి.
  • నారింజ – నిమ్మ తొక్కలు: నారింజ పండు తొక్క తీసి కింద భాగం అంటే తెల్లటి భాగాన్ని దంతాల మీద రుద్దండి. తెల్లటి భాగంలో డి-లిమోనెన్ ఉంటుంది. ఇది దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది. నిమ్మ తొక్కలు పళ్లను శుభ్రం చేయడానికి.. తెల్లగా చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. తొక్క తెల్లటి భాగంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి, ఆపై దంతాల అప్లై చేయాలి.
  • పసుపు: పసుపు కూడా తేలికపాటి బ్లీచింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది సహజ క్రిమినాశని కావున దంతాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. పసుపు ద్వారా పేస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఒక టీస్పూన్ పసుపులో కొబ్బరి నూనె, బేకింగ్ సోడా అర టీస్పూన్ కలపి టూత్‌పేస్ట్‌లా తయారు చేసుకోవచ్చు.
  • కలబంద: కలబంద అనేక సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది. ఇది దంతాలను తెల్లగా మారుస్తుంది. దీన్ని బేకింగ్ సోడాతో కలిపి దంతాలను శుభ్రం చేయడానికి టూత్‌పేస్ట్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది దంతాల మీద పసుపు మరకలను తొలగించడంలో సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Superfoods: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ సూపర్ ఫుడ్స్ తింటే ప్రయోజనాలెన్నో.. అవేంటో తెలుసుకోండి..

Health Tips: విటమిన్ బి-12 లోపిస్తే చాలా ప్రమాదం.. డైట్‌లో ఈ ఆహారాలను చేర్చుకోండి..!

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు