Weight Loss: బ్లాక్ ఫుడ్స్‌తో అధిక బరువుకు చెక్ పెట్టండి.. డైట్‌లో ఎలాంటి పదార్థాలు చేర్చుకోవాలంటే..?
మీ ఆహారం నుంచి తెల్లని వాటిని తొలగించి.. గోధుమ లేదా నలుపు రంగు పదార్థాలను చేర్చుకోవాలి. నలుపు రంగు ఆహార పదార్థాలు బరువు తగ్గించడంలో సహాయపడతాయి.
Black Food For Weight Loss: ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అయితే.. బరువు తగ్గేందుకు పలు డైట్లను అనుసరిస్తున్నారు. బరువు తగ్గాలనుకుంటే ముందుగా మీ ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం, పానీయాలను సమతుల్యం చేస్తే తప్ప.. మీరు ఏ వ్యాయామం లేదా యోగా చేసినా పూర్తి ప్రయోజనాన్ని పొందలేరు. బరువు తగ్గాలంటే ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇది కాకుండా మీ ఆహారం నుంచి తెల్లని వాటిని తొలగించి.. గోధుమ లేదా నలుపు రంగు పదార్థాలను చేర్చుకోవాలి. నలుపు రంగు ఆహార పదార్థాలు బరువు తగ్గించడంలో సహాయపడతాయి. మీరు ఆహారంలో ఏయే బ్లాక్ ఫుడ్స్ చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లాక్ రైస్: బరువు తగ్గడానికి అన్నం తినవచ్చు. కానీ మీ ఆహారంలో బ్రౌన్ రైస్ లేదా బ్లాక్ రైస్ చేర్చుకోవడానికి ప్రయత్నించండి. అవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి. బ్లాక్ రైస్‌లో ఆంథోసైనిన్‌లు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది వాపును తగ్గించే యాంటీ ఆక్సిడెంట్. బ్లాక్ రైస్‌లో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఈ అన్నం తినడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది.
బ్లాక్ వెల్లుల్లి: త్వరగా బరువు తగ్గాలనుకుంటే.. ఆహారంలో నల్ల వెల్లుల్లిని చేర్చుకోవాలి. బ్లాక్‌గార్లిక్‌లోని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో తెల్ల వెల్లుల్లి కంటే రెట్టింపు యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నల్ల వెల్లుల్లి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
బ్లాక్ ఫిగ్స్: బ్లాక్ అంజీర్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. నల్ల అత్తిపండ్లు రక్తపోటును తగ్గిస్తాయి. నల్ల అత్తి పండ్లలో అధిక ఫైబర్ ఉంటుంది, దీని కారణంగా బరువు వేగంగా తగ్గుతుంది. అత్తి పండ్లను తినడం వల్ల క్యాన్సర్‌తో పోరాడే శక్తి శరీరానికి లభిస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది.
బ్లాక్ టీ: ఈ రోజుల్లో బరువు తగ్గడానికి చాలామంది బ్లాక్ టీ తాగుతున్నారు. బ్లాక్ టీలో ఉండే పాలీఫెనాల్స్ సెల్ డ్యామేజ్‌ను తగ్గిస్తాయని ఒక నివేదికలో తేలింది. ఇది ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు పెరిగిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బ్లాక్ టీ కూడా సహాయపడుతుంది. బ్లాక్ టీని నిరంతరం తాగడం వల్ల ఊబకాయం, మధుమేహం తగ్గుతాయి.
బ్లాక్ బెర్రీ: బ్లాక్ బెర్రీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. బ్లాక్ బెర్రీ తినడం ద్వారా రుతుక్రమం సక్రమంగా జరుగుతుంది. అంతే కాకుండా ఇన్ఫ్లమేషన్ తగ్గించి చర్మాన్ని మేలు చేసేలా చేయవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: