Watch Video: గత ప్రభుత్వాలకు.. యోగి సర్కార్‌కి తేడా ఇదే.. కార్యకర్త ఇంట్లో స్నానం చేసిన యూపీ మంత్రి
తమ ప్రభుత్వంలో వీఐపీ సంస్కృతి లేదంటూ మంత్రి నంద్ గోపాల్ ట్విట్లర్‌లో వీడియోను షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Nand Gopal Gupta Nandi Bathing Video: ఉత్తరప్రదేశ్ మంత్రి నందగోపాల్ గుప్తా ఉన్నట్టుండి ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. ఓ కార్యకర్త ఇంట్లో బస చేసిన పారిశ్రామిక అభివృద్ధి శాఖ మంత్రి నంద్ గోపాల్ గుప్తా.. అత్యంత సాధారణ రీతిలో స్నానం చేసి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. నందగోపాల్ గుప్తా నంది.. ఇటీవల షాజహాన్ పూర్ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో చాక్ కన్హావు గ్రామం సందర్శించే సమయానికి రాత్రి అయ్యింది. దాంతో ఆయన అక్కడే ఓ కార్యకర్త ఇంట్లో బస చేశారు. మరుసటి రోజు ఉదయం నందగోపాల్.. అక్కడే ఉన్న చేతిపంపు వద్ద స్నానం చేశారు. సాధారణ బాత్రూం అయినప్పటికీ ఆయన అక్కడే కూర్చొని మంత్రి స్నానం చేశారు. తమ ప్రభుత్వంలో వీఐపీ సంస్కృతి లేదంటూ మంత్రి నంద్ గోపాల్ ట్విట్లర్‌లో వీడియోను షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తాను ఒక కప్పు టీతో రోజును ప్రారంభించానని, ఆపై స్నానం చేశానని మంత్రి నంద్ గోపాల్ గుప్తా నంది ఈ సందర్భంగా పేర్కొన్నారు.
దీంతోపాటు “యోగి ప్రభుత్వానికి.. గత ప్రభుత్వాలకు మధ్య ఉన్న తేడా ఇదేనంటూ నందగోపాల్ గుప్తా పేర్కొన్నారు. యోగి ప్రభుత్వానికి.. సామాన్యులకు మధ్య ఎటువంటి తారతమ్యం లేదు.. ఈ ప్రభుత్వంలో వీఐపీ సంస్కృతి లేదంటూ ఆయన అభిప్రాయపడ్డారు.
आज शाहजहांपुर जनपद के सिंधौली विकासखंड के चक कन्हऊ गांव में श्रीमती सहोदरा जी पत्नी श्री लीलाराम जी के घर पर रात्रि विश्राम के बाद सुबह की चाय और लोगों से बातचीत करते हुए दिन की शुरुआत हुई। वहीं हैंडपंप के पानी से स्नान किया। pic.twitter.com/fbewNxpx2b
— Nand Gopal Gupta ‘Nandi’ (@NandiGuptaBJP) May 7, 2022
కాగా.. మంత్రి సింప్లిసిటీని పలువురు కొనియాడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇలానే ఉంటే బాగుంటుందని యూజర్లు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా.. తన పర్యటనల సందర్భంగా నంద్ గోపాల్ గుప్తా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును పరిశీలిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: