AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఈద్‌ పార్టీకి పిలిస్తే.. బిర్యానీతో పాటు నెక్లెస్‌ మింగేశాడు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్..

ఓ వ్యక్తి పొట్టలో ఒకటిన్నర లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలను పోలీసులు గుర్తించారు. తాజాగా రంజాన్‌ పండుగను జరుపుకోవడానికి ఓ మహిళ తన మిత్రుడు, అతడి భార్యను ఇంటికి ఆహ్వానించారు.

Viral News: ఈద్‌ పార్టీకి పిలిస్తే.. బిర్యానీతో పాటు నెక్లెస్‌ మింగేశాడు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: May 07, 2022 | 8:37 PM

Share

Chennai Man swallowed jewels: దొంగలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నారు.. సరికొత్త ఐడియాలతో దోచుకుంటున్నారు.. తాజాగా ఓ వ్యక్తి చేసిన దొంగతనం అందర్ని ఆశ్చర్యపరిచేలా చేసింది. ఈ ఆశ్చర్యకర ఘటన తమిళనాడులోని చెన్నైలో ఉన్న సలిగ్రామంలో ఇటీవల జరిగింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.. ఓ వ్యక్తి పొట్టలో ఒకటిన్నర లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలను పోలీసులు గుర్తించారు. తాజాగా రంజాన్‌ పండుగను జరుపుకోవడానికి ఓ మహిళ తన మిత్రుడు, అతడి భార్యను ఇంటికి ఆహ్వానించారు. బిర్యానీని వడ్డించి వంటగదిలోకి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన అతడు అక్కడే ఉన్న బంగారు నెక్లెస్‌, గొలుసు, ఇతర ఆభరణాలను బిర్యానీలో కలుపుకొని తిన్నా డు. వంటగది నుంచి వచ్చిన మహిళ ఆభరణాలు కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఆమె మిత్రుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లి పరిశీలించగా పొట్టలో ఆభరణాలు కనిపించాయి. డాక్టర్లు ఆపరేషన్‌ చేసి వాటిని తొలగించారు.

నగల షాపులో పని చేసే ఓ మహిళ తన మేనేజర్, ఆమె పార్ట్‌నర్‌ (32)ను ఇటీవల రంజాన్ ఈద్‌ పార్టీకి ఆహ్వానించారు. పార్టీ అయిపోయాక అందరూ వెళ్లిపోయారు. ఆ తర్వాత తన ఇంట్లోని డైమండ్‌ నెక్లెస్, ఓ పెండెంట్, బంగారు చైన్‌ పోయిందని ఆమె గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చివరకు అతనికి అరటిపండు తినిపించి నగలు బయటకు తీయించి సదరు మహిళకు అప్పగించారు. తాగిన మైకంలో బిర్యానీతో పాటు నగలను కూడా మింగేశానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. వీటి విలువ రూ.లక్షన్నర వరకు ఉంటుందని విరుగంబక్కం పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Rahul Gandhi: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్.. ఏ విషయంలో అంటే..?

CM Stalin: ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న స్టాలిన్‌.. మరో ఐదు కొత్త పథకాలకు శ్రీకారం..

Amit Shah – Sourav Ganguly: దాదా ఇంట్లో అమిత్ షా డిన్నర్.. హీటెక్కిన బెంగాల్ రాజకీయం..