AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guru Mangal Yuti 2026: గురు-మంగళ యుతి.. వీరికి ఉద్యోగం, వ్యాపారాల్లో జాక్‌పాట్!

2026 నవంబర్ 12న సింహ రాశిలో గురు-మంగళ యుతి ఏర్పడనుంది. గురువు, కుజుడు కలయికతో మిథునం, కన్య, తుల రాశుల వారికి అదృష్టం కలిసిరానుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపారంలో లాభాలు, ఆర్థిక పురోగతి, కుటుంబంలో సంతోషం వంటి శుభ ఫలితాలు కలగవచ్చని భావిస్తున్నారు.

Guru Mangal Yuti 2026: గురు-మంగళ యుతి.. వీరికి ఉద్యోగం, వ్యాపారాల్లో జాక్‌పాట్!
Guru Mangal Yuti 2026
Janardhan Veluru
|

Updated on: Nov 01, 2026 | 12:35 PM

Share

Telugu Astrology: జ్యోతిషశాస్త్రంలో గురు, కుజ గ్రహాల కలయికకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 2026 నవంబర్ 12న కుజుడు సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే సింహ రాశిలో ఉన్న గురువుతో కలవడం వల్ల గురు-మంగళ యుతి ఏర్పడుతుంది. ఈ గ్రహాల కలయిక 2027 మార్చి 9 వరకు కొనసాగనుంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ యుతి అన్ని రాశులపై ప్రభావం చూపినప్పటికీ, ముఖ్యంగా మూడు రాశుల వారికి విశేష ప్రయోజనాలు చేకూర్చే అవకాశం ఉంది.

మిథున రాశి

గురు-మంగళ యుతి మిథున రాశి వారికి అనుకూల ఫలితాలను అందిస్తుంది. సంతానానికి సంబంధించిన పాత ఆందోళనలు తొలగిపోయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కీలకమైన వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. బంధువులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించడంతో పాటు ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఉన్నాయి.

కన్య రాశి

కన్య రాశి వారికి గురు-మంగళ యుతి అదృష్టాన్ని తీసుకురానుంది. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు, కొత్త బాధ్యతలు లభించే అవకాశాలున్నాయి. వ్యాపారాల్లో లాభాలు పెరిగి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు దక్కుతాయి. పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

తుల రాశి

తుల రాశి వారికి గురు-మంగళ యుతి కెరీర్, సామాజిక జీవితంలో విజయాలను అందిస్తుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కీలక పదవులు లేదా కొత్త బాధ్యతలు దక్కుతాయి. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు విజయవంతమై విస్తరణకు అవకాశాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి.

(గమనిక: పైన పేర్కొన్న ఫలితాలు జ్యోతిషశాస్త్ర నమ్మకాలు, గ్రహాల సంచారంపై ఆధారపడిన అంచనాలు మాత్రమే. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు)

Follow Us