Viral Video: భార్య షాపింగ్ పిచ్చిని ఆధారాలతో సహా నిరూపించిన భర్త.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..

Viral Video: పురుషులతో పోలిస్తే మహిళలకు షాపింగ్‌పై ఆసక్తి ఎక్కువ ఉంటుందని, అప్పటికే ఇంట్లో ఓ వస్తువు ఉన్నా సరే షాపింగ్‌కు వెళితే ఏదైనా కొత్తగా కనిపిస్తే కొనేస్తుంటారు. మహిళల విషయంలో పురుషుల నుంచి ఎక్కువ వచ్చే ఫిర్యాదులు ఇవే. మరీ ముఖ్యంగా..

Viral Video: భార్య షాపింగ్ పిచ్చిని ఆధారాలతో సహా నిరూపించిన భర్త.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: May 08, 2022 | 12:06 PM

Viral Video: ‘పురుషులతో పోలిస్తే మహిళలకు షాపింగ్‌పై ఆసక్తి ఎక్కువ ఉంటుంది, షాపింగ్‌కు వెళితే చాలు ఏదో ఒక వస్తువు కొంటూనే ఉంటారు… ‘ మహిళల విషయంలో పురుషుల నుంచి ఎక్కువ వచ్చే ఫిర్యాదులు ఇవే. మరీ ముఖ్యంగా భార్యలపై భర్తలు ఈ విషయంపై కంప్లైట్‌ చేస్తుంటారు. రకరకాల జోకులు కూడా వేస్తుంటారు. అయితే భార్యలు మాత్రం, తమ భర్తల వాదనను ఖండిస్తుంటారు. అవసరానికి మించి మేము ఎందుకు షాపింగ్‌ చేస్తాం. అంటూ భర్తలపై రివర్స్‌ అటాక్‌ చేస్తుంటారు. కానీ ఓ భర్త మాత్రం తన భార్యకు షాపింగ్‌ పిచ్చి ఏ రేంజ్‌లో ఉందో సాక్ష్యాధారలతో నిరూపించాడు.

వివరాల్లోకి వెళితే.. రాబర్ట్‌ అనే వ్యక్తి తన భార్యకు వంద జతల చెప్పులు ఉన్నాయని నిరూపించాలనుకున్నాడు. ఇందుకోసం తన భార్య ఊరు వదిలి వెళ్లే క్షణం కోసం వేచి చూశాడు. ఓ రోజు తన భార్య ఇంట్లోలేని సమయంలో, చెప్పుల జతలను లెక్కించాలనుకున్నాడు. భార్య షూస్‌ జతలన్నింటినీ ఒక వరుసలో పెట్టుకుంటూ పోయాడు. ఇలా వంద జతలను ఒక దాని తర్వాత మరొకటి పేర్చుకుంటూ పోతే.. బిల్డింగ్ పై నుంచి కింది వరకు చెప్పుల వరుస వెళ్లింది.  అలా లెక్కించుకుంటూ పోతే చివరికి ఏకంగా చెప్పుల జతల సంఖ్య వందకు చేరింది. దీనంతటినీ వీడియో రూపంలో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..