IPL 2022: సరికొత్త రికార్డు దిశగా రాజస్తాన్ రాయల్స్ బౌలర్.. కేవలం మరో 6 అడుగుల దూరంలోనే.. అదేంటంటే?

రాజస్థాన్ రాయల్స్ తరపున ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన చాహల్.. 22 వికెట్లు పడగొట్టాడు. అతను 14.50 సగటు, 7.25 ఎకానమీతో ఈ వికెట్లు తీసుకున్నాడు.

IPL 2022: సరికొత్త రికార్డు దిశగా రాజస్తాన్ రాయల్స్ బౌలర్.. కేవలం మరో 6 అడుగుల దూరంలోనే.. అదేంటంటే?
Yuzvendra Chahal
Follow us

|

Updated on: May 08, 2022 | 3:52 PM

ఐపీఎల్ 2022(IPL 2022) సీజన్ ఉత్కంఠ దశకు చేరుకుంది. 10 జట్ల మధ్య జరుగుతున్న ఈ పోరు.. ప్రస్తుతం నాలుగు స్థానాల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక వికెట్లు, పరుగుల విషయానికి వస్తే.. బౌలర్లే, బ్యాటర్ల మధ్య కూడా పోటీ సాగుతోంది. ఐపీఎల్ 2022లో అత్యధిక వికెట్లు పడగొట్టే బౌలర్ల మధ్య రోజురోజుకు పోటీ ఎక్కవవుతోంది. ఈ లిస్టులో విజేత నిలిచే వారకి పర్పుల్ టోపీ(Purple Cap) ధరించనున్నారు. ప్రస్తుతం ఈ రేసులో యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరపున సరికొత్త రికార్డు సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నాడు. చాహల్‌ను అందుకోవడం కూడా మిగతా బౌలర్లకు అసాధ్యంగానే మారింది. అయితే, ఈ లిస్టులో కుల్దీప్ యాదవ్ లేదా టి. నటరాజన్ బలమైన ప్రదర్శన చేస్తే, చాహల్‌ను అందుకునే ఛాన్స్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన చాహల్.. 22 వికెట్లు పడగొట్టాడు. అతను 14.50 సగటు, 7.25 ఎకానమీతో ఈ వికెట్లు తీసుకున్నాడు. ఇన్ని వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు.

Also Read: IPL 2022, CSK Vs DC: ఐపీఎల్‌లో మరోసారి కరోనా కలకలం.. పాజిటివ్‌గా తేలిన బౌలర్.. సందిగ్ధంలో ఢిల్లీ-చెన్నై మ్యాచ్‌‌?

ఒక సీజన్‌లో RRకి అత్యధిక వికెట్లు..

ప్రస్తుతం యుజ్వేంద్ర చాహల్ సాధించిన రికార్డు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం చాహల్ 22 వికెట్లతో ఉన్నాడు. అయితే అతను తన బ్యాగ్‌లో మరో 6 వికెట్లు పడగొట్టినట్లయితే, అతను ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవుతాడు. ప్రస్తుతం ఈ రికార్డులు 2013లో 28 వికెట్లు తీసిన ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ ఫాల్క్‌నర్ పేరిట ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

చాహల్‌కు పోటీగా ఆ ఇద్దరు..

వికెట్ల రేసులో యుజ్వేంద్ర చాహల్‌కు పోటీగా ఇద్దరు బౌలర్లు ఉన్నారు. కుల్దీప్ యాదవ్‌తో పాటు టి. నటరాజన్ పర్పుల్ క్యాప్ రేసులో దూసుకొస్తున్నారు. ప్రస్తుతం కుల్దీప్ 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీశాడు. ఈరోజు CSKతో మ్యాచ్‌లో సత్తా చాటి మరో 4 వికెట్లు తీస్తే.. చాహల్ సరసన చేరనున్నాడు.

అలాగే, ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ టి.నటరాజన్ ముందు కూడా ఓ అవకాశం ఉంది. ఆర్సీబీతో మ్యాచ్‌లో 5 వికెట్లు తీస్తే, ఈ పోటీలో మరింత ముందుకు దూసుకొస్తాడు. అయితే టీ20 మ్యాచ్‌ల్లో ఇది చాలా అరుదుగా జరుగుతుంది. నటరాజన్ ప్రస్తుతం అత్యధిక వికెట్ల రేసులో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌కు చెందిన కగిసో రబాడ మూడో స్థానంలో ఉండగా, కుల్దీప్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో 5వ స్థానం వనిందు హసరంగాకు దక్కింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022: 4 ఏళ్ల చెత్త రికార్డులో చేరిన కేకేఆర్ బౌలర్.. అదేంటంటే?

IPL 2022: మలింగ రికార్డును సమం చేసిన చాహల్.. బుమ్రా-భువనేశ్వర్‌లకే సాధ్యం కాలే.. అదేంటంటే?