IPL 2022: 12 వికెట్లు, 184 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు.. జట్టంతా విఫలమైనా.. వన్ మ్యాన్ ఆర్మీలా మారిన రూ. 12 కోట్ల ఆల్ రౌండర్..

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 177 పరుగులను ఛేదించేందుకు బరిలోకి దిగింది. అయితే 101 పరుగులకే కుప్పకూలింది. ఈ 101 పరుగులలో కేవలం 19 బంతుల్లో...

IPL 2022: 12 వికెట్లు, 184 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు.. జట్టంతా విఫలమైనా.. వన్ మ్యాన్ ఆర్మీలా మారిన రూ. 12 కోట్ల ఆల్ రౌండర్..
Ipl2022, Kolkata Knight Riders
Follow us
Venkata Chari

|

Updated on: May 08, 2022 | 5:10 PM

ఓవైపు జట్టు ఓడిపోతున్నా.. మరోవైపు ఓ ప్లేయర్ మాత్రం నిరాటంకంగా పోరుతున్నాడు. అటు బ్యాట్‌తో పాటు ఇటు బంతితోనూ జట్టుకు ఒంటిచేత్తో సత్తా చాటుతున్నాడు. అయితే, తోటి ఆటగాళ్ల మద్దతు లేకపోవడంతో ఈ ప్లేయర్ ప్రతిభ బయటకు రావడం లేదు. ఐపీఎల్ 2022(IPL 2022) లో ఇప్పటివరకు 184 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. అలాగే బౌలింగ్‌లోనూ 12 వికెట్లు పడగొట్టాడు. కానీ, ఇంత చేసినా టోర్నీలో అతని జట్టు ప్లే ఆఫ్స్(IPL Playoffs) చేరుకోలేక తంటాలు పడుతోంది. అందుకే క్రికెట్‌(Cricket)ను సమిష్టిగా రాణిస్తేనే విజయాలు సొంతం అవుతుంటాయిని అంటుంటారు.

Also Read: IPL 2022: సరికొత్త రికార్డు దిశగా రాజస్తాన్ రాయల్స్ బౌలర్.. కేవలం మరో 6 అడుగుల దూరంలోనే.. అదేంటంటే?

ఆ ఆటగాడు ఎవరంటే.. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతోన్న ఆండ్రీ రస్సెల్. జట్టు కోసం ఒంటరిగా పోరాడుతున్నాడు. నిన్న జరిగిన లక్నో సూపర్ జెయింట్‌లోనూ ఒక ఎండ్‌ నుంచి టీమ్‌ అంతా పెవిలియన్ చేరుతున్నా.. మరో ఎండ్‌ నుంచి తను మాత్రం ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు పాటుపడ్డాడు.

లక్నోపై రస్సెల్ దూకుడు..

ఇవి కూడా చదవండి

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 177 పరుగులను ఛేదించేందుకు బరిలోకి దిగింది. అయితే 101 పరుగులకే కుప్పకూలింది. ఈ 101 పరుగులలో కేవలం 19 బంతుల్లో ఆండ్రీ రస్సెల్ 45 పరుగులు చేసినవే కావడం విశేషం. ఇది మాత్రమే కాదు, దీనికి ముందు అతను బంతితో అత్యంత ప్రభావవంతమైన KKR బౌలర్‌గా నిలిచాడు. లక్నోపై 3 ఓవర్లలో 22 పరుగులకే ఇద్దరు బ్యాట్స్‌మెన్స్‌ను పెవిలియన్ చేర్చాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతాకు చెందిన ఏ బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్ కూడా రస్సెల్ సాధించినంతగా విజయవంతం కాలేదు.

IPL 2022లో ‘బిగ్గెస్ట్ ఫైటర్’..

ఆండ్రీ రస్సెల్ ఈ మ్యాచ్‌లో మాత్రమే ఈ ఘనత సాధించలేదు. అతను IPL 2022 అంతటా KKR కోసం పోరాడుతూనే ఉన్నాడు. అందుకే ఇప్పటి వరకు ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో 15.75 సగటుతో 12 వికెట్లు తీశాడు. 9 ఇన్నింగ్స్‌లలో 183.78 స్ట్రైక్ రేట్‌తో 272 పరుగులు చేశాడు. ఇందులో 27 సిక్స్‌లు, 15 ఫోర్లు ఉన్నాయి. అతను తన జట్టులో శ్రేయాస్ అయ్యర్ తర్వాత రెండవ అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్ కాగా, ఉమేష్ యాదవ్ తర్వాత రెండవ అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు.

మరిన్ని ఐపీఎల్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022, CSK Vs DC: ఐపీఎల్‌లో మరోసారి కరోనా కలకలం.. పాజిటివ్‌గా తేలిన బౌలర్.. సందిగ్ధంలో ఢిల్లీ-చెన్నై మ్యాచ్‌‌?

IPL 2022: రాజస్థాన్ రాయల్స్‌ టీంకు దూరమైన రూ.8.50 కోట్ల ప్లేయర్.. అసలు కారణం ఏంటంటే?