AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: రాజస్థాన్ రాయల్స్‌ టీంకు దూరమైన రూ.8.50 కోట్ల ప్లేయర్.. అసలు కారణం ఏంటంటే?

పంజాబ్ కింగ్స్‌పై విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన షిమ్రాన్ హెట్మెయర్ స్వదేశానికి చేరుకున్నాడు. ఈమేరకు రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ షేర్ చేసింది.

IPL 2022: రాజస్థాన్ రాయల్స్‌ టీంకు దూరమైన రూ.8.50 కోట్ల ప్లేయర్.. అసలు కారణం ఏంటంటే?
Shimron Hetmyer
Venkata Chari
|

Updated on: May 08, 2022 | 2:54 PM

Share

రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తుఫాన్ బ్యాట్స్‌మెన్ షిమ్రాన్ హెట్మెయర్ ఐపీఎల్ 2022(IPL 2022) మధ్యలో జట్టును విడిచిపెట్టి, స్వదేశం వెళ్లాడు. పంజాబ్ కింగ్స్‌పై జట్టు విజయం సాధించిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. మరోవైపు, ఐపీఎల్ 2022 లో లక్ష్యాన్ని ఛేదించే సమయంలో రాజస్థాన్ రాయల్స్ వారి మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత షిమ్రాన్ హెట్మెయర్(Shimron Hetmyer) ఇంటికి వెళ్ళడానికి సన్నాహాలు ప్రారంభించాడు. అకస్మాత్తుగా ఆయన ఇంటికి వెళ్లిపోవడానికి కారణం ఏంటని నెట్టింట్లో ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపించారు. షిమ్రాన్ హెట్మెయర్ గయానాలోని తన ఇంటికి తిరిగి వచ్చిన విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసి పంచుకుంది.

రాజస్థాన్ రాయల్స్ ట్వీట్‌లో షిమ్రాన్ హెట్‌మెయర్ ఇంటికి వెళ్ళడానికి గల కారణాన్ని పేర్కొంది. అలాగే ప్రస్తుతం ఈ బలమైన బ్యాట్స్‌మన్ మళ్లీ తన సేవలను అందించడానికి తిరిగి వస్తాడా లేదా అనే విషయాన్ని కూడా పేర్కొంది. మే 7న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హెట్మెయర్ కీలక పాత్ర పోషించాడు. అతను 16 బంతుల్లో 31 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి జట్టు 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేలా చేశాడు.

ఆదివారం ఉదయం షిమ్రాన్ హెట్మెయర్ గయానాకు బయలుదేరినట్లు రాజస్థాన్ రాయల్స్ తమ ట్వీట్‌లో తెలిపింది. తన భార్య తొలి బిడ్డకు జన్మనివ్వడంతో ఇంటికి వెళ్లినట్లు తెలిపాడు. అతని భార్య నిర్వాణి తల్లి కాబోతోంది. హెట్మెయర్ తండ్రిగా ప్రమోషన్ పొందడంతో అతను ఇంటికి వెళ్లాడు. వచ్చేవారం తిరిగి వచ్చి జట్టులో చేరతాడని ఫ్రాంచైజీ తెలిపింది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కూడా హెట్మెయర్ తండ్రిగా తిరిగి వచ్చే వరకు వేచి ఉంటామని రాసుకొచ్చింది.

ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ మంచి స్థితిలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో 7 విజయాలు, 4 ఓటములతో ప్లే-ఆఫ్‌కు చేరిన జట్టు తన వాదనను నిలబెట్టుకుంది. ఐపీఎల్ 2022లో, షిమ్రాన్ హెట్మెయర్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో 291 పరుగులు చేశాడు. అతను 72.75 సగటుతో 166 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులను సాధించాడు. ఈ క్రమంలోనే అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఐపీఎల్ 15వ సీజన్‌లో అత్యంత విజయవంతమైన మూడో బ్యాట్స్‌మెన్‌గా హెట్మెయర్ నిలిచాడు. అతని కంటే జోస్ బట్లర్, కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రమే ఎక్కువ పరుగులు చేశారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022: 4 ఏళ్ల చెత్త రికార్డులో చేరిన కేకేఆర్ బౌలర్.. అదేంటంటే?

KKR Vs LSG: రాణించిన లక్నో బౌలర్లు.. కోల్‌కత్తాపై ఘన విజయం.. కేకేఆర్‌ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు..!