AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. త్వరలో అందుబాటులోకి మరో సరికొత్త ఫీచర్‌.. ఇకపై ఆ నంబర్ డబుల్‌..

ట్సప్‌ గ్రూపుల్లో (Group Members) సభ్యుల సంఖ్యను రెట్టింపు చేయనుంది. కాగా ఇప్పటివరకు ఒక వాట్సప్‌ గ్రూప్‌లో 256 మందిని మాత్రమే సభ్యులుగా చేర్చుకునేందుకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సంఖ్యను 512కు పెంచుకోవచ్చు.

WhatsApp: వాట్సప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. త్వరలో అందుబాటులోకి మరో సరికొత్త ఫీచర్‌.. ఇకపై ఆ నంబర్ డబుల్‌..
Basha Shek
|

Updated on: May 08, 2022 | 4:50 PM

Share

యూజర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో ముందుకొస్తోంది వాట్సప్‌ (WhatsApp ). మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చే లక్ష్యంతో ఇప్పటికే కమ్యూనిటీ గ్రూప్‌ ఛాట్‌ పేరుతో అధునాతన ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది వాట్సప్ యాజమాన్యం. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు  సన్నాహాలు చేస్తోంది. అదేంటంటే..వాట్సప్‌ గ్రూపుల్లో (Group Members) సభ్యుల సంఖ్యను రెట్టింపు చేయనుంది. కాగా ఇప్పటివరకు ఒక వాట్సప్‌ గ్రూప్‌లో 256 మందిని మాత్రమే సభ్యులుగా చేర్చుకునేందుకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సంఖ్యను 512కు పెంచుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌ ప్రస్తుతం కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వాట్సప్‌ తెలిపింది. త్వరలో ప్రతి ఒక్కరికీ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.

కాగా కమ్యూనిటీ గ్రూప్‌ ఛాట్‌ ఫీచర్ ద్వారా యూజర్స్ కమ్యూనిటీ లోపల కూడా గ్రూప్స్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా వాట్సాప్ యూజర్లు సమాచారాన్ని ఎక్కువమందితో షేర్‌ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇటీవలే లొకేషన్‌ స్టిక్కర్‌, చాట్‌ లిస్ట్‌ స్టేటస్ అప్‌డేట్ వంటి ఫీచర్లను కూడా తీసుకురానున్నట్లు ప్రకటించింది. అలాగే ఇటీవలే ఎమోజీ రియాక్షన్‌ ఫీచర్‌ను కూడా యూజర్లకు పరిచయం చేసింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌ తరహాలోనే వాట్సప్ యూజర్లు కూడా ఎమోజీలతో వాట్సప్‌ స్టేటస్‌లు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇక ఇంతకుముందు వాట్సాప్‌లో టెక్ట్స్‌ మెసేజ్‌లు, డాక్యుమెంట్స్‌తోపాటు మీడియా ఫైల్స్‌నూ షేర్ చేసుకునేందుకు 100 ఎంబీ సైజు పరిమితి ఉండేది. దీన్ని ఇప్పుడు 2జీబీ వరకు పెంచుతున్నట్లు వాట్సాప్‌ వెల్లడించింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read: 

Cheteshwar Pujara: కౌంటీల్లో అదరగొడుతోన్న నయా వాల్‌.. పాక్‌ స్పీడ్‌స్టర్‌కు ఎలా చుక్కలు చూపించాడో మీరే చూడండి..

SRH vs RCB Live Score, IPL 2022: దూకుడుగా ఆడుతోన్న ఆర్సీబీ బ్యాటర్లు.. స్కోరెంతంటే..

Megastar Chiranjeevi: మదర్స్‌ డే స్పెషల్‌.. అంజనమ్మతో మధుర క్షణాలను గుర్తుచేసుకున్న మెగా బ్రదర్స్..