AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Number: మీ ఆధార్‌ నంబర్‌ను మర్చిపోయారా..? సులభంగా తెలుసుకోండి!

Aadhaar Number: ప్రస్తుతం ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ ఒకటి. ఇది లేనిది ఏ పనులు జరగవు. ప్రభుత్వ, ప్రైవేటు పథకాల నుంచి చిన్న పాటి పనులకు ఆధార్‌ కార్డు తప్పనిసరి కా..

Aadhaar Number: మీ ఆధార్‌ నంబర్‌ను మర్చిపోయారా..? సులభంగా తెలుసుకోండి!
Subhash Goud
|

Updated on: May 09, 2022 | 8:20 AM

Share

Aadhaar Number: ప్రస్తుతం ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ ఒకటి. ఇది లేనిది ఏ పనులు జరగవు. ప్రభుత్వ, ప్రైవేటు పథకాల నుంచి చిన్న పాటి పనులకు ఆధార్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే. అయితే ఆధార్‌ కార్డును ఎప్పుడు వెంట ఉంచుకోము. కొన్ని సందర్భాలలో ఆధార్‌ నంబర్‌ మర్చిపోతుంటాము. అయితే కొన్ని సులభమైన మార్గాల ద్వారా ఆధార్‌ నంబర్‌ను తెలుసుకోవచ్చు. ఒక విషయం ఏంటంటే ఆధార్ కార్డుకు మీ ఫోన్ నెంబ‌ర్ లింక్ (Mobile Number Link) అయ్యి ఉండాలి. అప్పుడు ఆధార్‌ నంబర్‌ను తెలుసుకునేందుకు సాధ్యమవుతుంది.

☛ ముందుగా స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూట‌ర్‌లో బ్రౌజ‌ర్ ఓపెన్ చేసి యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

☛ అనంత‌రం వెబ్‌సైట్‌లోని ‘మై ఆధార్’ సెక్షన్‌లోని ‘ఆధార్ స‌ర్వీసెస్’పై క్లిక్ చేసి.. అందులో ఉన్న ‘రిట్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ ఈఐడీ/యూఐడీ’ అనేదానిపై క్లిక్ చేయాలి.

ఇవి కూడా చదవండి

☛ త‌ర్వాత ఓపెన్ అయిన కొత్త పేజీలో ఆధార్ నంబ‌ర్ (యూఐడీ)ని సెల‌క్ట్ చేసుకోవాలి.

☛ అనంత‌రం మీ రిజిస్టర్ మొబైల్ నెంబ‌ర్ లేదా ఈమెయిల్ ఐడీని నమోదు చేయాలి.

☛ ఇక అక్కడే ఉన్న క్యాప్చా కోడ్‌ను ఎంట‌ర్ చేసి.. సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి.

☛ మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేసి ఎంట‌ర్ నొక్కాలి. దీంతో మొబైల్ నెంబ‌ర్‌కు ఆధార్ నెంబ‌ర్ మెసేజ్ రూపంలో వ‌స్తుంది. ఇలా సింపుల్‌గా మర్చిపోయిన ఆధార్‌ నంబర్‌ను తెలుసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?