Central Bank of India: 600 శాఖల మూసివేతపై క్లారిటీ ఇచ్చిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా!
Central Bank of India:కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) శాఖలను మూసివేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తీవ్ర నష్టాల్లో ఉన్న ఈ బ్యాంకు..
Central Bank of India:కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) శాఖలను మూసివేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తీవ్ర నష్టాల్లో ఉన్న ఈ బ్యాంకు.. సుమారు 600 బ్రాంచ్‌లను త్వరలో మూసివేసే నిర్ణయం తీసుకోనుందని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ అంశంపై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. బ్రాంచ్‌ల మూసివేతపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఆర్థికంగా బలోపేతం కావడానికి దేశ వ్యాప్తంగా 13 శాతం శాఖలను మూసివేయడం లేదా విలీనం చేయాలనే ఆలోచనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2017 జూన్ నుంచి సత్వర దిద్దుబాటు చర్యలు Prompt Corrective Action (PCA) అమలు అవుతోంది. కానీ ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖలను మూసివేయడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సదరు బ్యాంకు ప్రకటించింది.
వందేళ్లకుపై చరిత్ర ఉన్న సెంటర్ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇప్పుడు 4,594 శాఖలు ఉన్నాయి. 2017లో ఆర్బీఐ రూపొందించిన మార్గదర్శకాలను, నిబంధనలను కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉల్లంఘించాయని తెలుస్తోంది. ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహా మిగతా బ్యాంకులు కోలుకున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి