Vinita Agarwal: ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్ లో ప్రస్తుత సీఈవో పరాగ్ భార్య.. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే..
Vinitha Agarwal: ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్ల ట్విట్టర్ టేకోవర్ డీల్ లో Twitter CEO పరాగ్ అగర్వాల్ భార్య వినీతా అగర్వాల్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. వినీతా అగర్వాల్ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను వివాహం చేసుకున్నారు.
Vinita Agarwal: ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్ల ట్విట్టర్ టేకోవర్ డీల్ లో Twitter CEO పరాగ్ అగర్వాల్ భార్య వినీతా అగర్వాల్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. వినీతా అగర్వాల్ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను వివాహం చేసుకున్నారు. అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ దంపతులు వారి కుమారుడు అన్ష్ నివసిస్తున్నారు. ఆమె ట్విట్టర్ బయో ప్రకారం వినీత స్టాన్‌ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో వైద్యురాలు, అనుబంధ క్లినికల్ ప్రొఫెసర్. వినీత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బయోఫిజిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లో MD, Ph.D పూర్తి చేశారు.
అసలు ఎలాన్ మస్క్ ట్విట్టర్ టేకోవర్‌కి ఆమెకు ఉన్న సంబంధం ఏమిటా అని ఆలోచిస్తున్నారా. వినీత ప్రముఖ US వెంచర్ క్యాపిటల్ సంస్థ ఆండ్రీస్సెన్ హోరోవిట్జ్‌తో సాధారణ భాగస్వామిగా ఉన్నారు. సదరు క్యాపిటల్ వెంటర్ సంస్థ మస్క్ ట్విట్టర్ డీల్‌లో భాగం అయ్యేందుకు ఇప్పటికే బిడ్ చేసింది. వినీత సంస్థ బయో అండ్ హెల్త్ ఫండ్ కోసం థెరప్యూటిక్స్, లైఫ్ సైన్సెస్ టూల్స్/డయాగ్నోస్టిక్స్, డిజిటల్ హెల్త్‌లో పెట్టుబడులకు నాయకత్వం వహిస్తోంది.
మస్క్ కొత్త 7.1 బిలియన్ డాలర్ల నిధుల సేకరణ కమిట్‌మెంట్‌లలో భాగంగా ఇటీవల 400 మిలియన్ డాలర్లను అందించేందుకు అంగీకరించిన ఆండ్రీసెన్ హోరోవిట్జ్‌లో సాధారణ భాగస్వామిగా ఆమె ఉండటం ఆసక్తికర వివాదాన్ని సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది. మస్క్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరాగ్ భవిష్యత్తుపై సందేహాలు మెుదలయ్యాయి. ఈ భారత సంతతి సీఈవోను కంపెనీ నుంచి తప్పించేందుకు ఎలాన్ మస్క్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఈ మధ్య కాలంలో వార్తలు వస్తున్నాయి. ఒప్పందం ముగిసిన తర్వాత కొద్దికాలం పాటు మస్క్ ట్విట్టర్ CEOగా బాధ్యతలు చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Elon Musk has secured more than $7 billion from investors for his acquisition of Twitter.
Investors include: • Binance • Fidelity • Sequoia Capital • Andreessen Horowitz
Oracle’s Larry Ellison wrote a $1 billion check, which was the largest commitment by any investor. pic.twitter.com/uK2Dgh0z0o
— Joe Pompliano (@JoePompliano) May 5, 2022
ఇవీ చదవండి..
Anand Mahindra: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. ఆయన చేసిన పనికి నెట్టిజన్లు ఫిదా..
Gold, Silver Price Today: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు