AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Ration: మీకు రేషన్‌ కార్డు ఉందా..? అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఒకేసారి 3 నెలల ఉచిత రేషన్‌.. కేంద్రం సంచలన నిర్ణయం!

Free Ration: మీకు రేషన్‌ కార్డు ఉందా...? వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటోంది. రేషన్‌ కార్డుదారులకే ఒకేసారి మూడు నెలలకు సంబంధించి రేషన్‌ సరుకులని నిర్ణయించింది. ఈ నిర్ణయం వినియోగదారులకు శుభవార్తేనని చెప్పవచ్చు. ఏయే నెలలకు సంబంధించి..

Free Ration: మీకు రేషన్‌ కార్డు ఉందా..? అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఒకేసారి 3 నెలల ఉచిత రేషన్‌.. కేంద్రం సంచలన నిర్ణయం!
Free Ration
Subhash Goud
|

Updated on: Mar 20, 2026 | 8:36 PM

Share

Free Ration: దేశంలోని కోట్లాది రేషన్ కార్డ్ దారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ 2026 నెలలకు సంబంధించిన ఉచిత రేషన్‌ను ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ప్రకారం.. రేషన్‌ కార్డు లబ్ధిదారులు మూడు నెలలకు సరిపడే ధాన్యాన్ని ఒకేసారి పొందవచ్చు. ఆహార, ప్రజా పంపిణీ శాఖ రాష్ట్రాలకు ఇప్పటికే సూచనలు జారీ చేసింది. కేంద్ర నిల్వల నుంచి వెంటనే ధాన్యం తీసుకుని సమయానికి పంపిణీ చేయాలని ఆదేశించింది.

ఇప్పుడు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ 2026 నెలలకు సరిపడా ఉచిత రేషన్‌ను ఒకేసారి పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Diesel Price: దిమ్మదిరిగే షాకిచ్చిన చమురు కంపెనీలు.. భారీగా పెరిగిన డీజిల్ ధర

ఈ నిర్ణయం వెనుక కారణాలేంటి?

👉 1. తీవ్ర ఎండల హెచ్చరిక (Heatwave): వాతావరణ శాఖ ఈ సంవత్సరం తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేస్తోంది. దీంతో ప్రజలు మళ్లీ మళ్లీ రేషన్ షాపులకు వెళ్లకుండా ఒకేసారి సరుకులు అందించాలనే ఉద్దేశ్యం.

👉 2. గోదాముల్లో అధిక ధాన్యం నిల్వలు: ప్రస్తుతం భారత ఆహార సంస్థ (FCI) గోదాముల్లో సామర్థ్యానికి మించి ధాన్యం నిల్వ ఉంది. కొత్త రబీ పంట రాబోతున్న నేపథ్యంలో గోదాముల్లో ఖాళీ చేయడం అవసరమైంది. అంచనా ప్రకారం, ప్రస్తుతం 800 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం నిల్వలో ఉంది. లబ్ధిదారులకు సకాలంలో పంపిణీని నిర్ధారించడానికి వీలైనంత త్వరగా కేంద్ర నిల్వల నుండి ధాన్యాన్ని తీసుకోవాలని ఆహార, ప్రజా పంపిణీ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది.

వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి ప్రభుత్వం గత సంవత్సర కాలంలో గణనీయమైన చర్యలు కూడా తీసుకుంది. పార్లమెంటులో అందించిన సమాచారం ప్రకారం.. 2025లో మొత్తం 4.141 మిలియన్ల అర్హత లేని రేషన్‌ కార్డులను తొలగించారు. డిజిటల్ సంస్కరణలు, ఆధార్ అనుసంధానం వల్ల మోసపూరిత లబ్ధిదారులను గుర్తించడం సులభమైంది. దీంతో నకిలీ రేషన్‌ కార్డులను గుర్తించి తొలగిస్తోంది కేంద్రం.

నకిలీ రేషన్ కార్డులపై ఫోకస్:

గణాంకాల ప్రకారం.. రద్దు చేసిన కార్డుల సంఖ్యలో హర్యానా 1.343 మిలియన్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో 6.05 మిలియన్లతో రాజస్థాన్ ఉంది. ఉత్తర ప్రదేశ్ కూడా దాదాపు 600,000 మంది అనర్హుల పేర్లను జాబితా నుండి తొలగించింది.

ఆధార్ లింకింగ్, డిజిటల్ సిస్టమ్ వల్ల ఈ గుర్తింపు సులభమైంది:

దేశంలోని 99% కంటే ఎక్కువ ఫెయిర్ ప్రైస్ షాపులలో (FPS) ఇప్పుడు పాయింట్-ఆఫ్-సేల్ (ePOS) యంత్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 98% కంటే ఎక్కువ పంపిణీ బయోమెట్రిక్ ప్రామాణీకరణ ద్వారా జరుగుతోంది. మూడు నెలలకు సరిపడా రేషన్‌ను ఒకేసారి అందించడం వల్ల రవాణా ఖర్చులు ఆదా అవ్వడమే కాకుండా వర్షాకాలంలో రవాణా కష్టంగా ఉండే గ్రామీణ ప్రాంతాలకు కూడా సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. లబ్ధిదారులు తమ సమీపంలోని దుకాణానికి వెళ్లి నిర్దేశిత సమయంలోగా తమ కోటాకు మూడు రెట్లు ఎక్కువ రేషన్‌ను పొందవచ్చు.

మొత్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కోట్లాది పేద ప్రజలకు భారీ ఊరటనిస్తుంది. తీవ్ర ఎండలు, నిల్వల సమస్యలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ఎంతో ఉపయోగపడనుంది.

ఇది కూడా చదవండి: Zomato: ఇక బాదుడే.. బాదుడు.. ఫుడ్‌ ప్రియులకు భారీ షాక్‌ ఇవ్వబోతున్న జోమాటో..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us