Bangalore: ఆఫీస్ లో అలా చేసేందుకు అనుమతి.. బంపర్ ఆఫర్ ఇచ్చిన బెంగళూరు స్టార్టప్..
Startup News: ఈ రోజుల్లో ఉద్యోగాలు చాలా ఒత్తిడి కలిగి ఉంటున్నాయి. పని ఒత్తిడి కారణంగా నిద్రలేమి(Nap At Work) ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బండికి గురిచేస్తోంది.
Startup News: ఈ రోజుల్లో ఉద్యోగాలు చాలా ఒత్తిడి కలిగి ఉంటున్నాయి. పని ఒత్తిడి కారణంగా నిద్రలేమి(Nap At Work) ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బండికి గురిచేస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఒత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నాయి. తాజాగా.. బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ సంస్థ తమ ఉద్యోగుల ఒత్తిడిని తగ్గించాలనే ఉద్ధేశంతో అదిరిపోయే నిర్ణయం తీసుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే వారికి పని సమయంలోనే కొద్దిగా విశ్రాంతి అందించేందుకు వెసులుబాటును కల్పిస్తోంది. ఇలా ఒక కునుకు తీస్తే ఉద్యోగులు కూడా రీఫ్రెష్ అవుతారని సదరు స్టార్టప్ కంపెనీ భావిస్తోంది.
చిన్న కునుకు తీసి మళ్లీ పని ప్రారంభిద్దాం అనుకునే వారి కోసం బెంగళూరుకు చెందిన స్టార్టప్ వేక్ ఫిట్ సొల్యూషన్స్(Wake Fit) అనే స్టార్టప్ నిర్ణయం తీసుకుంది. ప్రతి రోజు మధ్యాహ్నం 30 నిమిషాల పాటు ఉద్యోగులు కునుకు తీసేందుకు వెసులుబాటును కల్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఉద్యోగులు మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.30 వరకు ఈ అవకాశాన్ని అందించింది. నాసా అధ్యయనం ప్రకారం మధ్యాహ్నం 26 నిమిషాలు కునుకు తీస్తే.. సదరు ఉద్యోగి పని సామర్థ్యం 33 శాతం మేర పెరుగుతుందని తేలింది. గత ఆరేళ్లుగా వేక్ ఫిట్ పరుపులు, తలగడలు తయారు చేసే వ్యాపారంలో ఉంది. వేక్ ఫిట్ కో-ఫౌండర్ రామలింగగౌడ మాట్లాడుతూ తాము గత ఆరేళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నామని, ఉద్యోగులకు విశ్రాంతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాము నిద్రను ఎప్పుడూ సీరియస్‌గానే పరిగణిస్తామని ఆయన అన్నారు. ఉద్యోగుల మెంటల్ హెల్త్ చాలా ముఖ్యమైనదని అభిప్రాయపడ్డారు.
మరికొన్ని కంపెనీలు ఇలాంటి ఆఫర్లు..
ఉద్యోగులను ఆకట్టుకునేందుకు ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ డ్రీమ్11 కూడా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. కరోనా ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత.. ముంబైకి బదిలీ అయిన కంపెనీ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు మూడు వారాల పాటు 5 స్టార్ హోటల్స్‌లో బస చేసేందుకు అవకాశం ఇచ్చింది. అంతేకాక హెచ్‌ఆర్‌ఏ కింద లక్ష రూపాయలను కంట్రిబ్యూట్ చేసింది. ఈ పాలసీలతో తమ ఉద్యోగుల్లో మూడింట రెండు వంతుల మంది ఫిబ్రవరిలో ఆఫీసు నుంచే పని చేయడం ప్రారంభించినట్టు తెలిపింది. గ్రోసరీ స్టార్టప్ జాప్టో కూడా ఉద్యోగుల కోసం పలు రకాల ప్రయోజనాలు తీసుకొచ్చింది. ఉద్యోగులకు వెకేషన్ రియంబర్స్‌మెంట్‌ను ఇచ్చింది. దీని కింద ఉద్యోగులు లీవ్ తీసుకున్నా వేతనాన్ని చెల్లించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Anand Mahindra: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. ఆయన చేసిన పనికి నెట్టిజన్లు ఫిదా..