AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: విమానంలో మాతృ దినోత్సవం విషెస్ చెప్పిన కో-పైలట్.. చూసినవారందరూ ఫిదా..

Viral Video: మాతృ దినోత్సవం సందర్భంగా విమానయాన సంస్థ ఇండిగో ఒక ఆసక్తికరమైన సన్నివేశాన్ని షేర్ చేసింది. ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో నెటిజిన్లను ఫిదా చేస్తోంది.

Viral Video: విమానంలో మాతృ దినోత్సవం విషెస్ చెప్పిన కో-పైలట్.. చూసినవారందరూ ఫిదా..
Mothers Day
Ayyappa Mamidi
|

Updated on: May 09, 2022 | 8:35 AM

Share

Viral Video: మాతృ దినోత్సవం సందర్భంగా విమానయాన సంస్థ ఇండిగో ఒక ఆసక్తికరమైన సన్నివేశాన్ని షేర్ చేసింది. ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో నెటిజిన్లను ఫిదా చేస్తోంది. ఈ వీడియోలో ఇండిగో(Indigo) కో-పైలట్‌ అమన్ ఠాకూర్.. పైలట్ అయిన తన తల్లికి మాతృ దినోత్సవం శుభాకాంక్షలను ఎంతో స్పెషల్‌గా తెలపటం అందరినీ మంత్రముగ్దుల్ని చేస్తోంది. విమానంలో ఇచ్చిన ఈ శుభాకాంక్షల అనౌన్స్‌మెంట్ అందులోని ప్రయాణికుల మన్ననలను పొందింది. ఇండిగో ఎయిర్ క్రాఫ్ట్ ఫస్ట్ ఆఫీసర్(సెకండ్ పైలట్) అయిన అమన్ ఠాకూర్ చేసిన అనౌన్స్‌మెంట్, లవ్లీ స్పీచ్‌ ఒకసారి మీరు వినండి..

‘‘లేడిస్ అండ్ జెంటిల్‌మెంట్, బాయ్స్ అండ్ గర్ల్స్, నేను మీ ఫస్ట్ ఆఫీసర్ అమన్ ఠాకూర్‌. మీ అందరికీ తెలిసిందే మాతృ దినోత్సవం ఎంతో ప్రత్యేకమైన రోజు. మీ అందరూ మీ తల్లులకు మీ ప్రేమను, గౌరవాన్ని తెలియజేసి ఉంటారని నేను భావిస్తున్నాను. ఈ మాతృ దినోత్సవం సందర్భంగా నేను మా అమ్మకు ఓ చిన్న థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నా లైఫ్‌లో 24 ఏళ్ల పాటు .. ప్యాసెంజర్‌గా ఇండిగోలో, పలు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాల్లో మా అమ్మతో కలిసి ప్రయాణించాను. ఈ రోజు నాకెంతో ప్రత్యేకమైన రోజు. నేను ఆమెతో కలిసి కో-పైలట్‌గా ఈ విమానంలో ఉన్నాను. నాకోసం నువ్వు చేసిన ప్రతి పనికి కృతజ్ఞతలు అమ్మ. నాతో ఉన్నందుకు థ్యాంక్యూ అమ్మా..’’ అంటూ అమన్ ఠాకూర్ తన తల్లికి స్పెషల్ విషెస్ చెప్పాడు. తన తల్లితో కలిపి విమానాన్ని నడపటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఈ అనౌన్స్‌మెంట్ వినగానే అందులో ప్రయాణిస్తున్న వారు చప్పట్లతో అయనను ముంచెత్తారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇవీ చదవండి..

Bangalore: ఆఫీస్ లో అలా చేసేందుకు అనుమతి.. బంపర్ ఆఫర్ ఇచ్చిన బెంగళూరు స్టార్టప్..

Vinita Agarwal: ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్ లో ప్రస్తుత సీఈవో పరాగ్ భార్య.. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే..