AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Atta Price: రికార్డులు కొల్లగొడుతున్న గోధుమ పిండి ధర.. 12 ఏళ్ల తర్వాత భారీగా పెరుగుతున్న రేట్లు..

మొన్న ఆయిల్.. ఆ తర్వాత నిమ్మకాయలు.. ఇప్పుడు గోధుమ పిండి వంతు వచ్చింది. రోజురోజుకు పెరుగుతున్న ధరలు వంటింట్లో మంటపెడుతున్నాయి. వీటన్నింటికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంటూ పలువురు పేర్కొంటున్నారు.

Atta Price: రికార్డులు కొల్లగొడుతున్న గోధుమ పిండి ధర.. 12 ఏళ్ల తర్వాత భారీగా పెరుగుతున్న రేట్లు..
Atta Price
Shaik Madar Saheb
|

Updated on: May 09, 2022 | 8:24 AM

Share

Wheat Flour Price in India: దేశంలో పెట్రో ధరలతోపాటు వంట గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. దీంతోపాటు పెరుగుతున్న నిత్యవసర వస్తువలు, వంట నూనె ధరలతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. తాజాగా.. ఇప్పుడు గోధుమ పిండి వంతు వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గోధుమ పిండి రికార్డు స్థాయిలో పెరిగింది. గోధుమ పిండి (అట్టా) నెలవారీ సగటు రిటైల్ ధర ఏప్రిల్‌లో కిలోకు రూ. 32.38గా ఉంది.. అయితే.. తాజాగా రేటు రూ.59 కి చేరింది. గణాంకాల ప్రకారం.. 2010 నుంచి ఈ ధర అత్యధికమని పేర్కొంటున్నారు. భారతదేశంలో గోధుమల ఉత్పత్తి, నిల్వలు రెండూ పడిపోవడంతో గోధుమ పిండి ధరలు పెరుగుతున్నాయి. దీంతో దేశంలో గోధుమ పిండి డిమాండ్ బాగా పెరిగింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖలు నివేదించిన డేటా ప్రకారం.. శనివారం (మే 7)న గోధుమ పిండి రిటైల్ ధర కిలో రూ. 32.78 ఉంది. గతేడాది (రూ. 30.03) కంటే.. ఈ ధర కంటే 9.15 శాతం ఎక్కువగా పెరిగింది.

అక్కడ రూ.59కి చేరిన ధర..

156 కేంద్రాలలో జరిపిన సర్వే ప్రకారం.. శనివారం నాడు కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ రాష్ట్రంలోని పోర్ట్ బ్లెయిర్‌లో అత్యధికంగా కిలో గోధుమ పిండి రూ. 59 ఉండగా.. మరియు పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాలో అత్యల్పంగా రూ. 22 ఉంది. నాలుగు మెట్రో నగరాల్లో.. సగటున గోధుమ పిండి రిటైల్ ధర వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలో అత్యధికంగా ఉంది రూ. 49 ఉండగా.. చెన్నై రూ. 34, కోల్‌కతా రూ. 29, ఢిల్లీ రూ. 27 గా ఉంది. హైదరాబాద్‌లో రిటైల్ మార్కెట్‌లో రూ.40 గా ఉంది. జనవరి 1 నుంచి గోధుమ పిండి రోజువారీ రిటైల్ ధరలు 5.81 శాతం పెరిగాయని.. గణాంకాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 2021లో నమోదైన సగటు రిటైల్ ధర రూ. 31/కిలో కంటే ఈ ఏడాది ఏప్రిల్‌లో రేట్లు మరింత పెరిగాయి.

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ఉత్పత్తి పడిపోయిన నేపథ్యంలో గోధుమల ధరలు పెరగడం.. భారతీయ గోధుమలకు అధిక విదేశీ డిమాండ్ కారణంగా పిండి ధర పెరగడానికి కారణమని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం డిమాండ్ పెరిగిన నేపథ్యంలో గోధుమ పిండి మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.

Also Read:

Cyclone Asani: ముంచుకొస్తున్న అసని తుపాను.. మరో 24 గంటల్లో తీరానికి దగ్గరగా వస్తుందంటున్న ఐఎండీ..

Anand Mahindra: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. ఆయన చేసిన పనికి నెట్టిజన్లు ఫిదా..