Kamareddy Accident: డ్రైవర్ చేసిన ఆ తప్పే ప్రాణాలు మింగింది.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య..

25 మంది ప్రయాణికులతో వస్తున్న టాటా ఏస్‌ వాహనం.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు మరణించగా.. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మరో నలుగురు తనువుచాలించారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు.

Kamareddy Accident: డ్రైవర్ చేసిన ఆ తప్పే ప్రాణాలు మింగింది.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య..
Kamareddy Accident
Follow us

|

Updated on: May 09, 2022 | 6:50 AM

Kamareddy Road Accident: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం కారణంగా తొమ్మిది మంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. డ్రైవర్‌ చేసిన తప్పు మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటన ఎల్లారెడ్డి పోలీసు స్టేషన్‌ పరిధిలోని హసన్‌పల్లి గేటు వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. 25 మంది ప్రయాణికులతో వస్తున్న టాటా ఏస్‌ వాహనం.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు మరణించగా.. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మరో నలుగురు తనువుచాలించారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. ప్రమాద సమయంలో వాహనంలో 25 మంది ప్రయాణిస్తుండగా.. వారిలో మొత్తం తొమ్మిది మంది మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో 14 మందికి కూడా గాయాల్వడంతో వారికి కూడా చికిత్స అందుతోంది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలంలోని చిల్లర్గి గ్రామానికి చెందిన సౌదర్‌పల్లి మాణిక్యం గత గురువారం మరణించారు. దశదినకర్మ అనంతరం ఆచారం ప్రకారం.. వారి కుటుంబ సభ్యులను ఆదివారం టాటా ఏస్‌ వాహనంలో ఎల్లారెడ్డి పట్టణంలోని వారపుసంతలో అంగడిదింపుడు కార్యక్రమానికి తీసుకెళ్లీ తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో టాటాఏస్ డ్రైవర్‌ అతివేగంగా వాహనాన్ని నడిపి.. నిజాంసాగర్‌ మండలం హసన్‌పల్లి గేటు వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. అయితే.. ప్రమాదాన్ని నివారించేందుకు లారీ డ్రైవర్‌ రోడ్డుకిందకు దూసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయినట్లు స్థానికులు తెలిపారు.

క్షణాల వ్యవధిలోనే 9 మంది మృతి..

ఇవి కూడా చదవండి

ఈ ఘటనలో డ్రైవర్‌ సాయిలు (25), లచ్చవ్వ (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే.. క్షతగాత్రులను బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆసుపత్రులకు తరలించారు. ఈ క్రమంలో అంజవ్వ (40), వీరమణి (38), సాయవ్వ (40) మరణించారు. మరికొందరిని నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వీరవ్వ (70), గంగామణి (45) మరణించారు. బాన్సువాడ ఆసుపత్రి నుంచి నిజామాబాద్‌ తరలిస్తుండగా ఎల్లయ్య (45), పోచయ్య (44) మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనపై ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని బాధితులు పేర్కొంటున్యనారు.

అంగడిదింపుడు కార్యక్రమం అంటే..

ఏవరైనా చనిపోతే.. వారి దశదిన కర్మ పూర్తయిన మరుసటి రోజు ఈ తంతు చేపడతారు. ఆ వ్యక్తి కుటుంబసభ్యులు, బంధువులను వారపు సంతకు తీసుళ్లి.. మృతుని చితికి నిప్పంటించిన వ్యక్తికి సంతలోని దినుసులు, నిత్యావసర వస్తువులను ముట్టిస్తారు. దీనినే అంగడిదింపుడుగా పేర్కొంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Telangana Politics: రాహుల్ గాంధీ డిక్లరేషన్‌పై మంత్రి హరీష్ రావు సెటైర్స్.. ఓ రేంజ్‌లో సెటైర్లు పేల్చిన మంత్రి హరీష్ రావు..!

ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా