ప్రేమానంద్ జీ మహారాజ్.. మౌనం మనసుకు నిజమైన శాంతిని ఎలా ఇస్తుందో తెలుసా?

Samatha

04  march 2026

ప్రేమానంద్ జీ మహారాజ్ నిశ్శబ్దం గురించిన ఆలోచనల గురి చాలా గొప్పగా తెలియజేశాడు. ఆయన ఎన్నో విషయాల గురించి తెలియజేశాడు.

ప్రేమానంద్ జీ మహారాజ్

అదే విధంగా ఒక వ్యక్తికి మౌనమే నిజమైన శాంతిని ఎలా ఇస్తుందో కూడా తెలియజేయడం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం.

మౌనమే నిజమైన శాంతి

మౌనంగా ఉండటం అంటే కేవలం నిశ్శబ్ధంగా ఉండటం మాత్రమే కాదు, ఆత్మను దైవంతో అనుసాధానించడం, ఇది శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనం.

శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనం

ఇక ఈ నిశ్శబ్ధంలో కూడా అనేకరకాలు ఉంటాయి. వాక్కు నిశ్శబ్ధం, మనసు నిశ్శబ్ధం, ఆలోచనల నిశ్శబ్ధం. ఇవి ప్రతి వ్యక్తి జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతాయి.

నిశ్శబ్ధంలో రకాలు

ముఖ్యంగా కుటుంబ జీవితాన్ని గడుపుతున్నవారు, కొన్ని క్లిష్టసమయాల్లో నిశ్శబ్ధంగా ఉండటం చాలా ఉత్తమం అంటున్నారు ప్రేమానంద్ జీ మహారాజ్.

కుటుంబ జీవితం

మానవుల తప్పులు అనేవి ఎక్కువగా మాటల ద్వారా జరుగుతాయి. అయితే నిశ్శబ్ధంగా ఉన్న సమయంలో ఆ తప్పులు జరగకుండా ఉంటుందంట.

మానవుల తప్పులు

గొప్పవారు చాలా వరకు అవసరం అయినప్పుడు మాత్రమే మాట్లాడుతారు. వారి మాటలు చాలా నిజాయితీగా, తియ్యగా ఉంటాయి. ఇది వారి గౌరవాన్ని నిలబెడుతుంది.

గొప్పవారు

వ్యర్థమైన మాటలు, గాసిప్స్,అబద్ధాలు, అతిగా మాట్లాడటం లాంటివి కొన్నిసార్లు మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. అందుకే చాలా వరకు నిశ్శబ్ధమే మీకు విజయాన్ని తీసుకొస్తుంది.

వ్యర్థమైన మాటలు