Crime News: మద్యం మత్తులో నీళ్లనుకొని యాసిడ్ కలుపుకొని తాగాడు.. తనువు చాలించాడు..!
Crime News: కొంతమంది మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా ఎవ్వరికి తెలియదు. దీనివల్ల అనవసరంగా ప్రమాదాలని కొని తెచ్చుకుంటున్నారు. కుటుంబ సభ్యులని ఒంటరి
Crime News: కొంతమంది మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా ఎవ్వరికి తెలియదు. దీనివల్ల అనవసరంగా ప్రమాదాలని కొని తెచ్చుకుంటున్నారు. కుటుంబ సభ్యులని ఒంటరి చేసి అకాలంగా మృతిచెందుతున్నారు. తాజాగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో నీళ్లనుకొని యాసిడ్ కలుపుకొని మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామానికి చెందిన ఎర్రవేని మహేష్ సింగరేణిలో జాబ్ చేస్తాడు. గత నెల 18న మద్యం మత్తులో మంచినీరు అనుకొని యాసిడ్‌ని మద్యంలో కలుపుకుని తాగాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మహేశ్‌కు భార్య, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి