Telangana Politics: రాహుల్ గాంధీ డిక్లరేషన్‌పై మంత్రి హరీష్ రావు సెటైర్స్.. ఓ రేంజ్‌లో సెటైర్లు పేల్చిన మంత్రి హరీష్ రావు..!
Telangana Politics: తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్‌ఎస్ డైలాగ్ వార్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. రాహుల్ టూర్‌పై హరీశ్‌రావు సెటైర్లు వేస్తే,
Telangana Politics: తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్‌ఎస్ డైలాగ్ వార్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. రాహుల్ టూర్‌పై హరీశ్‌రావు సెటైర్లు వేస్తే, కేటీఆర్ కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించింది రాహుల్‌గాంధీ టూర్. పర్యటన ఖరారైనప్పటి నుంచే, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇక సభ అయిపోయాకా, గులాబీ నేతలు మాటల దాడి మరింత పెంచారు. తాజాగా రాహుల్ పర్యటనపై తనదైన స్టైల్‌లో పంచ్‌లు వేశారు మంత్రి హరీశ్. ఏ హోదాలో డిక్లరేషన్ ఇచ్చారో అర్థంకావడం లేదన్నారు. చంద్రబాబు చెప్పులు మోసినవారిని పెట్టుకున్నారని, ప్రభుత్వాన్ని కాపాడుకోలేని పార్టీ కాంగ్రెస్ అని విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం నీళ్లపై రైతులే చెబుతారన్న హరీష్‌రావు, కాంగ్రెస్, బీజేపీ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో వస్తే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎక్కడికి వెళ్తున్నాయో చూపిస్తామన్నారు మంత్రి హరీష్‌రావు.
అటు టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్‌పై చాలా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు టీపీసీసీ చీఫ్ రేవంత్. రాహుల్ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎంత ఆదరణ ఉందో అందరికీ అర్ధమైందని, అదిచూసి ఓర్వలేకే మంత్రి కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీని పొలిటికల్ టూరిస్ట్ అనే కూతలు కూసే కేటీఆర్, తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఏ పార్టీయో గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. ఎదుటి వాళ్లను వేలెత్తి చూపేముందు మనల్ని నాలుగువేళ్ల మనల్నే చూపిస్తాయన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. సవాళ్ల నుంచి పారిపోవడంలో, ఇచ్చిన హామీలు మరిచిపోవంతో సీఎం కేసీఆర్ పీహెచ్‌డీ చేశారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ పర్యటన ఇచ్చిన ఉత్సాహంతో, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, టీఆర్‌ఎస్‌కు ప్రజలు విశ్రాంతి కల్పిస్తారని కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి.