3 ఏళ్లుగా విమర్శలు.. రిటైర్మెంట్ చేయాలంటూ సలహాలు.. కట్ చేస్తే.. వరుస సెంచరీలతో స్పీడ్ పెంచిన టీమిండియా ప్లేయర్..

ఈ ప్లేయర్ పునరాగమనం సాధ్యం కాదనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ఈ 34 ఏళ్ల ప్లేయర్ కావాలంటే రిటైర్మెంట్ తీసుకోవచ్చని కూడా ఎంతోమంది విమర్శించారు. అయితే పరిస్థితులు ఒకేలా ఉండవని నమ్మని అతను.. సంకల్పంతో ముందుకు సాగాడు..

3 ఏళ్లుగా విమర్శలు.. రిటైర్మెంట్ చేయాలంటూ సలహాలు.. కట్ చేస్తే.. వరుస సెంచరీలతో స్పీడ్ పెంచిన టీమిండియా ప్లేయర్..
Cheteshwar Pujara
Venkata Chari

|

May 08, 2022 | 7:33 PM

మూడేళ్లుగా పరుగులు రాబట్టడంలో విఫలం. అవకాశాలు ఎన్ని ఇచ్చినా.. ఫలితం మాత్రం శూన్యం. దక్షిణాఫ్రికా(South Africa) పర్యటన నుంచి రంజీ ట్రోఫీ(Ranji Trophy) వరకు, అతని బ్యాట్ నుంచి పరుగులు రావడంలో విఫలమయ్యాయి. ఫామ్‌లేమితో పోరాడుతోన్న ఈ టీమిండియా(Team India) సీనియర్ ప్లేయర్‌పూ సర్వత్రా విమర్శలు వినిపించాయి. ఇక రిటైర్మెంట్ తీసుకోవాలంటూ కూడా సలహాలు ఇచ్చారు. కానీ, తన కెరీర్‌ ఇలాంటి పరిస్థితిలో ముగించకూడదున్నాడు. ఎలాగైన తన పూర్వ ఫాంను తిరిగి అందుకోవాలని కోరుకున్నాడు. అందుకే ఎంతో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఎన్ని విమర్శలు వచ్చినా.. తన బలమైన సంకల్పంతో ముందుకు సాగాడు. ప్రస్తుతం వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు చేస్తూ.. అందరి నోళ్లూ మూయిస్తున్నాడు. తిరిగి టీమిండియాలోకి తన మార్గాన్ని మళ్లించుకుంటున్నాడు. ఆయనెవరో కాదు.. టీమిండయా మరో వాల్‌గా పేరుగాంచిన చెతేశ్వర్ పుజారా.

Also Read: IPL 2022: సరికొత్త రికార్డు దిశగా రాజస్తాన్ రాయల్స్ బౌలర్.. కేవలం మరో 6 అడుగుల దూరంలోనే.. అదేంటంటే?

చెతేశ్వర్ పుజారా ఒకప్పుడు టీమ్ ఇండియాకు రాహుల్ ద్రవిడ్ తర్వాత మరో ‘వాల్‌’గా పేరుగాంచాడు. అయితే, రాహుల్ ద్రవిడ్ కోచ్ అయిన తర్వాత పుజారా.. టీమిండియాలో తన స్థానాన్ని కోల్పోయాడు. పుజారా పునరాగమనం సాధ్యం కాదనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ఒకానొకదశలో ఈ 34 ఏళ్ల ప్లేయర్ కావాలంటే రిటైర్మెంట్ తీసుకోవచ్చని కూడా ఎంతోమంది విమర్శించారు. అయితే, విమర్శలను పక్కన పెట్టిన పుజారా.. తన సత్తా చాటాలని కోరుకున్నాడు. తన బ్యాటింగ్‌తోనే అందరి నోళ్లూ మూయించాలని కోరుకున్నాడు. అందుకే ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్ తరపున ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఈ సమయంలోనూ ఎందరో విమర్శించారు. ఇక్కడే ఆడలేకపోయావు, అక్కడ ఎలా రాణిస్తావ్ అంటూ కామెంట్లస్ చేశారు. కానీ, తన పునరాగమనాన్ని ఘనంగా చాటాలనే సంకల్పం ముందు.. ఎలాంటి విమర్శలు పనిచేయలేదు. ఈ క్రమంలో తన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌లో అద్భుతంగా ఆడుతూ.. నాలుగో సెంచరీని కూడా పూర్తి చేశాడు.

ఇక్కడే చాంపియన్ ప్లేయర్‌కి, సాధారణ ఆటగాడికి మధ్య ఉన్న తేడా అర్థం చేసుకోవచ్చు. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి రంజీ ట్రోఫీ వరకు, అతని బ్యాట్ నుంచి పరుగులు రావడంలో విఫలమయ్యాయి. పుజారా ఇంగ్లాండ్‌లోని కౌంటీ ఛాంపియన్‌షిప్‌ను ఆశ్రయించాడు. ఆ తర్వాత పుజారా శ్రమతో కాలం, పరిస్థితులు, మనుషుల భావాలు కూడా మారిపోయాయి.

పుజారా గత నెల రోజులుగా సస్సెక్స్ క్రికెట్ క్లబ్ తరపున ఇంగ్లాండ్‌లో పేరుగాంచిన ప్రసిద్ధ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో రెండవ డివిజన్‌లో ఆడుతున్నాడు. కేవలం 133 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఈ క్లబ్‌కు ఆడుతున్న పుజారా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. ప్రతి మ్యాచ్‌లో తన బ్యాట్‌తో సెంచరీ చేశాడు. శనివారం, మే 7న మిడిల్‌సెక్స్‌తో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో పుజారా సెంచరీ సాధించాడు.

పుజారా సెంచరీ వేగం కూడా చాలా మారిపోయింది. సాధారణంగా అతని స్లో బ్యాటింగ్‌కు విమర్శలు ఎదుర్కొనే పుజారా.. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో కేవలం 133 బంతుల్లో వరుసగా నాలుగో సెంచరీని సాధించాడు. ఆట ముగిసే సమయానికి, అతను 149 బంతుల్లో 125 పరుగులు చేశాడు. ఇందులో 16 ఫోర్లు, రెండు అద్భుతమైన సిక్సర్లు ఉన్నాయి.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో పుజారాకు సస్సెక్స్‌తో ఈ కౌంటీ సీజన్ బాగానే ఉంది. ఈ జట్టు తరఫున తొలిసారి ఆడుతున్న అతడు ఇప్పటి వరకు ప్రతి మ్యాచ్‌లోనూ సెంచరీ లేదా డబుల్ సెంచరీ సాధించాడు. అతను ఇప్పటివరకు 4 మ్యాచ్‌లలో 7 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అందులో అతని బ్యాట్‌తో 2 డబుల్ సెంచరీలతో సహా మొత్తం 4 సెంచరీలు వచ్చాయి.

భారత జట్టు ఈ ఏడాది జులైలో ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉంది. గత ఏడాది సిరీస్‌లో మిగిలి ఉన్న చివరి టెస్టు ఆడాల్సి ఉంది. సహజంగానే, పుజారా ఈ టెస్టులో జట్టులో తన స్థానాన్ని సంపాదించడానికి బలమైన వాదనలు వినిపిస్తున్నాడనడంలో సందేహం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022: ఢిల్లీ జట్టుకు మరోషాక్.. హాస్పిటల్‌లో చేరిన కీలక ప్లేయర్.. ఎందుకంటే?

ఇవి కూడా చదవండి

IPL 2022: 12 వికెట్లు, 184 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు.. జట్టంతా విఫలమైనా.. వన్ మ్యాన్ ఆర్మీలా మారిన రూ. 12 కోట్ల ఆల్ రౌండర్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu