Viral Video: పెళ్లిలో ఫొటోగ్రాఫర్‌ చిలిపి చేష్టలు.. పెళ్లికూతురు రియాక్షన్‌ చూస్తే..

Funny Video: పెళ్లి వేడుకల ఫొటోలు, వీడియోలు తీసేందుకు వచ్చిన ఓ ఫొటోగ్రాఫర్‌ చేసిన చిలిపి చేష్టలను చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీసే నెపంతో పూజ ప్లేట్‌ దగ్గర ఉన్న డబ్బును దొంగలించడం మనకు కనిపిస్తుంది.

Viral Video: పెళ్లిలో ఫొటోగ్రాఫర్‌ చిలిపి చేష్టలు.. పెళ్లికూతురు రియాక్షన్‌ చూస్తే..
Follow us
Basha Shek

|

Updated on: May 08, 2022 | 9:49 PM

Funny Video: ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో బాగా వైరలవుతున్నాయి. ముఖ్యంగా వధూవరులు, వారి స్నేహితులు, అతిథులు చేసే డ్యాన్సులు సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. ఈక్రమంలోనే మరొక వెడ్డింగ్‌ వీడియో బాగా చక్కర్లు కొడుతోంది. పెళ్లి వేడుకల ఫొటోలు, వీడియోలు తీసేందుకు వచ్చిన ఓ ఫొటోగ్రాఫర్‌ చేసిన చిలిపి చేష్టలను చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీసే నెపంతో పూజ ప్లేట్‌ దగ్గర ఉన్న డబ్బును దొంగలించడం మనకు కనిపిస్తుంది. అతను చాకచక్యంగా ఈ పని ముగించినప్పటికీ ప్లేట్‌ దగ్గర కూర్చున్న పెళ్లికూతురు మాత్రం అతడిని పసిగడుతుంది. దీంతో వరుడితో పాటు పెళ్లికొచ్చిన అతిథులందరూ ఆ ఫొటోగ్రాఫర్‌ను చూసి నవ్వుకుంటారు.

పెళ్లికూతురు రియాక్షన్‌ సూపర్బ్‌..

ఇవి కూడా చదవండి

సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఫొటో తీయడానికని మెల్లగా పూజా ప్లేటు దగ్గరకు చేయి పెట్టడం, ఆతర్వాత కెమెరా చాటున హడావిడిగా డబ్బు తీసుకుని అక్కడి నుంచి జారుకోవడం ప్రారంభిస్తాడు. అయితే పూజా ప్లేట్ దగ్గర కూర్చున్న వధువు అతను ఇలా చేయడం చూసి నవ్వడం ప్రారంభిస్తుంది. ఆతర్వాత వరుడితో పాటు అందరూ ఫొటోగ్రాఫర్‌ను చూసి నవ్వడం ప్రారంభిస్తారు. ‘ఫొటోగ్రాఫర్‌ దొంగతనం చేయడం చూశారా’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్‌చేయగా సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. అయితే వీడియో చూస్తుంటే సరదా కోసమే ఫొటోగ్రాఫర్‌ ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. నెటిజన్లు కూడా అలాగే స్పందిస్తున్నారు. అయితే ఫొటోగ్రాఫర్‌ను చూసి పెళ్లికూతురు రియాక్షన్‌ మాత్రం అదిరిపోయిందంటూ హార్ట్‌లు, ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Mothers Day 2022: అమ్మ ఒడిలో అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

Raashi Khanna: మదర్స్‌ డే స్పెషల్‌.. తల్లికి లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హీరోయిన్‌.. ధర ఎంతో తెలుసా?

SRH vs RCB Live Score: డుప్లెసిస్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌.. దినేశ్ కార్తీక్‌ మెరుపులు.. హైదరాబాద్‌ టార్గెట్‌ ఎంతంటే..