SRH vs RCB Live Score: డుప్లెసిస్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌.. దినేశ్ కార్తీక్‌ మెరుపులు.. హైదరాబాద్‌ టార్గెట్‌ ఎంతంటే..

స్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి శుభారంభం లభించలేదు. విరాట్‌ కోహ్లీ మరోసారి గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆతర్వాత పటిదార్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ముందుకు తీసుకెళ్లాడు డుప్లెసిస్‌. రెండో వికెట్‌కు సెంచరీకిపైగా భాగస్వామ్యం అందించారు.

SRH vs RCB Live Score: డుప్లెసిస్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌.. దినేశ్ కార్తీక్‌ మెరుపులు.. హైదరాబాద్‌ టార్గెట్‌ ఎంతంటే..
Srh Vs Rcb
Follow us
Basha Shek

|

Updated on: May 08, 2022 | 6:24 PM

SRH vs RCB Live Score, IPL 2022: డుప్లెసిస్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ (50 బంతుల్లో 73)కు తోడు చివర్లో దినేశ్‌ కార్తీక్‌ ( 8బంతుల్లో 30, 4 సిక్స్‌లు, ఒక ఫోర్‌) మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు భారీస్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసి హైదరాబాద్‌ ముందు భారీ లక్ష్యాన్ని ముందుంచింది. వీరితో పాటు రజత్‌ పటిదార్‌ (48), మ్యాక్స్‌వెల్‌ (33) రాణించారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి శుభారంభం లభించలేదు. విరాట్‌ కోహ్లీ మరోసారి గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆతర్వాత పటిదార్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ముందుకు తీసుకెళ్లాడు డుప్లెసిస్‌. రెండో వికెట్‌కు సెంచరీకిపైగా భాగస్వామ్యం అందించారు. మ్యాక్స్‌వెల్‌ కూడా కొన్ని మెరుపులు మెరిపించాడు. అయితే బెంగళూరు ఇన్నింగ్స్‌లో దినేశ్ కార్తీక్‌ ఇన్నింగ్సే హైలెట్‌గా నిలిచింది. అప్పటివరకు ఓ మోస్తరుగా ఉన్న స్కోరుకు తన ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఊపు తెచ్చాడు. కేవలం 8 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. దీంతో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఇక హైదరాబాద్‌ బౌలర్లలో జగదీశ్‌ సుచిత్‌ (30/2) రాణించాడు. కార్తిక్‌ త్యాగి ఒక వికెట్‌ తీశారు. ఫరూఖీ (47/0), ఉమ్రాన్‌ రెండు ఓవర్లలో 25 పరుగులతో భారీ రన్స్‌ సమర్పించుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read: 

Cheteshwar Pujara: కౌంటీల్లో అదరగొడుతోన్న నయా వాల్‌.. పాక్‌ స్పీడ్‌స్టర్‌కు ఎలా చుక్కలు చూపించాడో మీరే చూడండి..

WhatsApp: వాట్సప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. త్వరలో అందుబాటులోకి మరో సరికొత్త ఫీచర్‌.. ఇకపై ఆ నంబర్ డబుల్‌..

Megastar Chiranjeevi: మదర్స్‌ డే స్పెషల్‌.. అంజనమ్మతో మధుర క్షణాలను గుర్తుచేసుకున్న మెగా బ్రదర్స్..