AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: బరిలోకి దిగేముందు బ్యాట్ కొరుకుతున్న ధోనీ.. అసలు విషయం ఇదేనన్న మాజీ స్పిన్నర్..

బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చే ముందు ధోనీ తన బ్యాట్‌ను కొరుకుతున్నట్లు కనిపించాడు. దీంతో నెట్టింట్లో ప్రశ్నల వర్షం కురుస్తోంది. దీనికి భారత మాజీ స్పిన్నర్ మిశ్రా క్లారిటీ ఇచ్చాడు.

IPL 2022: బరిలోకి దిగేముందు బ్యాట్ కొరుకుతున్న ధోనీ.. అసలు విషయం ఇదేనన్న మాజీ స్పిన్నర్..
Ipl 2022, Ms Dhoni
Venkata Chari
|

Updated on: May 09, 2022 | 2:05 PM

Share

బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చే ముందు ధోనీ(MS Dhoni) తన బ్యాట్‌ను కొరుకుతూ కనిపించాడు. దీంతో నెట్టింట్లో ధోనీ బ్యాటింగ్‌కు దిగేముందు బ్యాట్‌ను తింటుంటాడని పలువురు కామెంట్లు చేస్తున్నాడు. ఈమేరకు భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత CSK సారథి ఎందుకు అలా చేస్తాడో టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ మిశ్రా వివరించాడు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ధోనీ బ్యాట్ కొరుకుతున్న ఫొటోను పంచుకున్నాడు. కాగా, ఐపీఎల్ 2022(IPL 2022) మెగా వేలంలో భారత ప్రముఖ లెగ్ స్పిన్నర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ బరిలో దిగలేదు. మాజీ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ ఆటకు సంబంధించిన వివిధ సమస్యలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంటాడు. కాగా, ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా, మిశ్రా మ్యాచ్‌లో జరిగిన ఈ సన్నివేశాన్ని నెట్టింట్లో పంచుకున్నాడు.

Also Read: IPL 2022: 11 మ్యాచ్‌ల్లో 3 సార్లు సున్నానే.. 10 ఏళ్లలో చెత్త సగటుతో బ్యాటింగ్.. ‘గోల్డెన్ డక్’లా మారిన రన్ మెషీన్..

కాగా, MSD తన బ్యాట్‌ను శుభ్రంగా ఉండాలని కోరుకుంటాడని ఈ మాజీ లెగ్ స్పిన్నర్ వెల్లడించాడు. అందుకే తన బ్యాట్‌పై థ్రెడ్ లేదా టేప్ లేకుండా చూసుకుంటాడని ఆయన తెలిపాడు. ఈమేరకు సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చాడు.. “ధోని తరచుగా తన బ్యాట్‌ను ఎందుకు కొరుకుతుంటాడు’ అని మీరు ఆలోచిస్తున్నారా.. ‘ధోనీ తన బ్యాట్‌ను శుభ్రంగా ఉండాలని ఇష్టపడుతుంటాడు. అందుకే బ్యాట్‌కు ఉన్న టేప్ తొలగించడానికి అలా చేస్తాడు. MS బ్యాట్ నుంచి టేప్ లేదా థ్రెడ్ బయటకు రావడం మీకు కనిపించదు. #CSKvDC #TATAIPL2022” అంటూ మిశ్రా ట్వీట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ధోని అభిమానుల ఫుల్ సఫోర్ట్ మధ్య మైదానంలోకి ప్రవేశించాడు. ఈ దిగ్గజ ఫినిషర్ 2 సిక్సర్లు, ఒక బౌండరీ సహాయంతో కేవలం 8 బంతుల్లో 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. డెవాన్ కాన్వే (49 బంతుల్లో 87), రుతురాజ్ గైక్వాడ్ (33 బంతుల్లో 41) జట్టును ఆదుకోవడంతో చెన్నై జట్టు.. 200 పరుగుల మార్కును దాటింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మొదట బ్యాటింగ్ చేయమని కోరడంతో మెన్ ఇన్ ఎల్లో చివరికి 208/6 వద్ద ముగిసింది. చెన్నైకి ప్లేఆఫ్‌ల రేసు నుంచి దాదాపు తప్పుకుంది.

Also Read: IPL 2022: ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన బౌలర్లు.. సొంత జట్టు పాలిట విలన్లు.. ఎందుకో తెలుసా?

బ్రేకుల్లేని బుల్డోజర్‌లా ధోని.. ప్లేఆఫ్స్‌కు చెన్నై చేరాలంటే.. ఎస్‌ఆర్‌హెచ్, ఆర్సీబీ మిగిలిన మ్యాచ్‌ల్లో!