Cyclone Asani: అసని ఎఫెక్ట్‌తో విశాఖ నుంచి ఆగిన విమాన సర్వీసులు పునరుద్ధరణ
అసని తుపాను ప్రభావంతో విశాఖ నుంచి రెండు రోజులుగా రద్దైన విమాన రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు.
Cyclone Asani: అసని తుపాను ప్రభావంతో విశాఖ నుంచి రెండు రోజులుగా రద్దైన విమాన రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. విశాఖ నుంచి హైదరాబాద్ సర్వీస్‌ను పునరుద్ధరించినట్లు స్పైస్‌జెట్ ప్రకటించింది. అలాగే, విశాఖ – సింగపూర్ విమానం యధావిధిగా నడపనున్నట్టు.. స్కూప్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది.
అయితే, అసని తుఫాన్ నేపథ్యంలో గత రెండు రోజులుగా విశాఖ నుంచి అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. మొత్తం 22 సర్వీసుల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. బెంగళూరు, దిల్లీ నుంచి రెండు విమాన సర్వీసులను ఎయిర్ ఏషియా రద్దు చేసింది. తుపాను దృష్ట్యా ఎయిరిండియా విమన సర్వీసులు కూడా రద్దు చేశారు. స్పైస్‌జెట్ విమాన సర్వీసులను ఈ ఉదయం రద్దు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. మరోవైపు విమాన సర్వీసులను పునరుద్దరించి అధికారులు.. అయితే, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని విశాఖ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.