AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ట్రైన్ల చివరి బోగీపై ఉండే ‘X’ సింబల్‌ వెనుక ఇంత సీక్రెట్ ఉందా..? తెలిస్తే పక్కా ఆశ్చర్యపోతారు

ఇండియాలో రైళ్లల్లో ప్రయాణించే ప్రజల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. తరచూ లక్షలాది మంది రైళ్ల ద్వారా తమ ప్రయాణాలను సాగిస్తూ ఉంటారు. అయితే రైలు చివరి బోగీ వెనుక X అనే సింబల్ అందరూ చూసే ఉంటారు. దీని వెనుక అనేక సీక్రెట్ ఉంది. అదేంటంటే..

Indian Railways: ట్రైన్ల చివరి బోగీపై ఉండే 'X' సింబల్‌ వెనుక ఇంత సీక్రెట్ ఉందా..? తెలిస్తే పక్కా ఆశ్చర్యపోతారు
Indian Railways
Venkatrao Lella
|

Updated on: Mar 13, 2026 | 4:23 PM

Share

ప్రతీఒక్కరూ ఒక్కసారైనా ఎప్పుడో ఒకసారి రైళ్లల్లో ప్రయాణించి ఉంటారు. ఇక రైళ్లు పట్టాలపై వెళ్లుతున్నప్పుడు లేదా బయల్దేరే సమయంలో చూసే ఉంటారు. ఇలాంటప్పుడు రైళ్లపై ఉండే అనేక సంకేతాలను మీరు చూసుంటారు. వాటికి అర్థమేంటి అనేది తెలియక వదిలేస్తూ ఉంటారు. కొంతమంది వాటికి అర్థం ఏంటనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే.. మరికొంతమంది మనకు అవసరం లేదు కదా అని పట్టించుకోవడం మానేస్తారు. అయితే రైళ్లల్లో చివరి బోగీ వెనుక మీరు X అనే గుర్తు చూసే ఉంటారు. తెలుపు లేదా పసుపు రంగులో ఇది ఉంటుంది. దీనికి అసలు అర్థమేంటో మీకు తెలుసా..? దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

భద్రత కోసం..

ట్రైన్లో చివరి బోగి వెనుక ఈ సింబర్ ముద్రించడం వెనుక అర్థమేంటి అంటే.. ఒకవేళ ప్రయాణం మధ్యలో బోగీలు విడిపోతే దీని ద్వారా తెలుసుకోవచ్చు. చివరి బోగీ రైలు నుంచి విడిపోయి పట్టాల మధ్యలో నిలిచిపోతే అదే పట్టాలపై వచ్చే రైలుకు ఢీకొట్టుకుని ప్రమాదాలు జరుగుతాయి. దీంతో చివరి బోగీ వెనుక X అని రాయడం వల్ల ఒకవేళ బోగీ మధ్యలో విడిపోయినా తెలుసుకోవచ్చు. అదే ఎలాంటి గుర్తు లేకపోతే బోగీ మిస్ అయిందా.. లేదా అనేది అధికారులు తెలుసుకోలేరు. అందుకే ట్రైన్ స్టేషన్ దాటి వెళ్లేటప్పుడు చివరి బోగీ వెనుక X సింబల్ ఉందా.. లేదా అనేది స్టేషన్ మాస్టర్ గమనిస్తారు. ఈ గుర్తు ఉంటే ట్రాక్‌ ఖాళీగా ఉందని, వేరే ట్రైన్లను పంపవచ్చని అధికారులకు అర్థమవుతోంది. ఒకవేళ చివరి బోగీ వెనుక X సింబల్ లేకపోతే మధ్యలో బోగీ విడిపోయిందనే నిర్ధారణకు వస్తారు. వెంటనే పై అధికారులకు స్టేషన్ మాస్టర్ సమాచారం అందించి ఆ పట్టాలపై వేరే ట్రైన్ రాకుండా దారి మళ్లిస్తారు.

రాత్రి పూట ఎలా అంటే..?

ఇక పగటిపూట బోగీ వెనుక ఉంటే సింబల్ కనిపిస్తుంది. అదే సాయంత్రం, రాత్రి వేళల్లో కనిపించదు. అలాంటి సమయంలో రైలు వెనుక భాగంలో ఒక రెడ్ లైట్ ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. దీనిని బట్టి స్టేషన్ మాస్టర్ నిర్ధారించుకుంటారు. రైలు చివరి బోగీ వెనుక LV అని రాసి ఉండటం మీరు చూసి ఉంటారు. దీనికి అర్థం లాస్ట్ వెహికల్. అంటే ఇదే చివరి బోగీ అని అర్థం. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడం, రైల్వే భద్రత కోసం ఈ సింబల్స్ ఉపయోగపడతాయి. ఎప్పటినుంచో రైల్వే వ్యవస్థల్లో  ఈ సింబల్స్ ద్వారా భద్రతను నిర్ధారించే ప్రాసెస్ నడుస్తోంది.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!