AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deewana Teaser : యూట్యూబ్‏లో దూసుకుపోతున్న దీవానా టీజర్.. చిన్న సినిమాకు ఊహించని రెస్పాన్స్..

ప్రస్తుతం చిన్న సినిమాలకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి. ఇక ఇప్పుడు మరో సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోవడానికి రెడీ అయ్యింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పుడు దూసుకుపోతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ అనుకుంటున్నారు.

Deewana Teaser : యూట్యూబ్‏లో దూసుకుపోతున్న దీవానా టీజర్.. చిన్న సినిమాకు ఊహించని రెస్పాన్స్..
Deewana Teaser
Rajitha Chanti
|

Updated on: Mar 13, 2026 | 4:26 PM

Share

తెలుగు సినీరంగంలో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వస్తున్న సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా తెరకెక్కించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతున్న సినిమా పేరు దీవానా. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హర్షిత్, స్మేహ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా యూట్యూబ్ లో దూసుకుపోతుంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అమ్మాయిలు ఎంత అందంగా ఉంటే అంత సతాయిస్తారు .. నా దృష్టిలో ఆ అమ్మాయి మాత్రమే అందంగా ఉంటుంది అని వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ టీజర్ ఇప్పుడు యూత్ ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాతో హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై వెండితెరపై తమ టాలెంట్ నిరూపించుకోనున్నారు. సినిమాలో హర్షిత్ రెడ్డి లుక్స్, యాక్టింగ్ చూస్తేంటే నటుడిగా తనదైన ముద్ర వేయడం ఖాయమని తెలుస్తోంది. తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పుడు మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రానికి ఈశ్వర్ చంద్ సంగీతం అందించారు. ఈ సినిమాకు గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేయాలని భావిస్తుంది.

ఈ సినిమాను నిజమైన లోకేషన్లలో షూటింగ్ చేయడం.. అలాగే హీరో నుంచి సినిమాలో ప్రతి పదం పక్కా తెలంగాణ భాష కావడంతో జనాలకు తొందరగానే రీచ్ అయ్యేలా కనిపిస్తుంది. పల్లెటూరిలో ఉండే ప్రేమ.. వ్యత్యాసాన్ని ఈ సినిమా ద్వారా మరోసారి చూపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ దూసుకుపోతుంది.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..

Follow Us