PM Kisan: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ కు కొత్తగా అప్లై చేస్తున్నారా ? అయితే మారిన రూల్స్ ఏంటో తెలుసా ?..

ఇప్పుడు పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ విధానంలో అనేక మార్పులు వచ్చాయి.. ఇప్పుడు రేషన్ కార్డు అవసరాలతోపాటు పత్రాల సాఫ్ట్ కాపీలు (PDF) పోర్టల్లో అప్లోడ్ చేయాలి.

PM Kisan: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ కు కొత్తగా అప్లై చేస్తున్నారా ? అయితే మారిన రూల్స్ ఏంటో తెలుసా ?..
Pm Kisan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 25, 2022 | 8:22 AM

కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పదకొండు విడతలుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసింది. సంవత్సరానికి రూ.6000 అన్నదాతలకు అందించాల్సి ఉంటుంది..ప్రతి విడతల వారిగా రూ. 2000 అందిస్తుంది. అయితే తాజాగా పీఎం కిసాన్ పథకంలో కొత్తగా నమోదు చేసుకునేవారికి కొత్త రూల్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్రం.. ఇకపై పీఎం కిసాన్ పథకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ స్కీమ్ లో చేరేవారికి ఇకపై రేషన్ కార్డు తప్పనిసరి చేసింది.. ఈ పథకంలో నమోదు చేసుకునేటప్పుడు అన్నదాతలు తమ రేషన్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. లబ్దిదారులు EKYC పూర్తి చేసినప్పుడే పీఎం కిసాన్ తదుపరి విడతను పొందుతారు..

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం అప్లై చేసుకునే వారు.. పోర్టల్ లో రేషన్ కార్డు నంబర్ ను నమోదు చేసి తర్వాత మాత్రమే భర్త లేదా భార్యలో ఒకరికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో రూ. 2000  పడుతుంది. ఇప్పుడు పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ విధానంలో అనేక మార్పులు వచ్చాయి.. ఇప్పుడు రేషన్ కార్డు అవసరాలతోపాటు పత్రాల సాఫ్ట్ కాపీలు (PDF) పోర్టల్లో అప్లోడ్ చేయాలి.

పీఎం కిసాన్ కోసం కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్ ప్రకారం.. రేషన్ కార్డ్ నంబర్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇకపై సాధ్యం కాదు.. అంతేకాకుండా ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, డిక్లరేషన్ హార్డ్ కాపీలను సమర్పించాల్సిన అవసరం లేదు.. అలాగే ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తోపాటు ఇతర పత్రాల ఫోటోకాపీలను, వ్యవసాయ శాఖ లేదా ఇతర సంబంధింత కార్యాలయానికి సమర్పించాలి.. డాక్యుమెంట్స్ పీడీఎప్ ఫైల్ ను క్రియేట్ చేసి పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.. దీంతో రైతులకు రిజిస్ట్రేషన్ సమయం కూడా తగ్గుతుంది.

E-KYC కూడా తప్పనిసరి.. లబ్ధిదారులైన రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ఇ-కెవైసి చేయడాన్ని కూడా ప్రభుత్వం తప్పనిసరి చేసింది. e-KYC అప్డేట్ చేయడానికి 31 జూలై 2022 చివరి తేదీ. PM కిసాన్ వెబ్‌సైట్ లో రైతులు ఇంట్లో కూర్చొని తమ స్మార్ట్‌ఫోన్‌ల నుండి కూడా eKYC అప్టేడ్ చేయవచ్చు. రైతులు తమ సమీప కామన్ సర్వీస్ సెంటర్‌ను లో కూడా eKYC పొందవచ్చు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే