Akasa Airlines: జూలై చివరి వారంలో ఆకాశంలో ఎగరనున్న ఆకాశ విమానం.. త్వరలో టికెట్ల బుకింగ్‌ ప్రారంభం..

రాకేష్ ఝున్‌జున్‌వాలా-మద్దతుగల ఆకాశ ఎయిర్ జూలై చివరిలో ప్రారంభమవుతుందని ఎయిర్‌లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినయ్ దూబే తెలిపారు. డిజిసిఎ సహకారంతో వచ్చే వారం నుంచి విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు...

Akasa Airlines: జూలై చివరి వారంలో ఆకాశంలో ఎగరనున్న ఆకాశ విమానం.. త్వరలో టికెట్ల బుకింగ్‌ ప్రారంభం..
Akasa Airline
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 25, 2022 | 8:13 AM

రాకేష్ ఝున్‌జున్‌వాలా-మద్దతుగల ఆకాశ ఎయిర్ జూలై చివరిలో ప్రారంభమవుతుందని ఎయిర్‌లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినయ్ దూబే తెలిపారు. డిజిసిఎ సహకారంతో వచ్చే వారం నుంచి విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. DGCA నుంచి తుది NOC పొందే ముందు ఏదైనా ఎయిర్‌లైన్ ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ప్రూవింగ్ ఫ్లైట్ సర్టిఫికేషన్ పొందిన తర్వాత, ఎయిర్‌లైన్ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ పొందుతుంది. దీని తరువాత, విమానయాన సంస్థకు విమానాశ్రయం స్లాట్ జారీ చేస్తారు. ఆ తర్వాత టిక్కెట్ విక్రయాలు ప్రారంభమవుతాయి. టిక్కెట్ బుకింగ్ ప్రక్రియ రెండు-మూడు వారాల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత ఆకాశ ఎయిర్‌లైన్స్‌ ఆకాశంలో ఎగరనుంది. ఆకాష్ ఎయిర్ తన మొదటి సర్వీస్‌ దేశీయంగా నడపనుంది. ఎయిర్‌లైన్ అంతర్జాతీయ విమానాలు నడపడం కోసం ప్రణాళికలు రచిస్తుంది.

అయితే ఇది 2023 రెండవ భాగంలో ప్రారంభించే అవకాశం ఉంది. విమానయాన రంగంలో వినయ్ దూబేకు పెద్ద పేరు ఉంది. అతను తన కెరీర్‌లో డెల్టా ఎయిర్‌లైన్స్, జెట్ ఎయిర్‌వేస్ వంటి విమానయాన సంస్థలను నిర్వహించారు. మెట్రో నగరాల నుంచి టైర్-2, టైర్-3 నగరాలకు ఆకాశ ఎయిర్ సర్వీస్ ఉంటుందని దూబే తెలిపారు. ఆకాశ ఎయిర్‌కు చెందిన తొలి విమానం ఢిల్లీకి చేరుకుంది. మార్చి 2023 నాటికి 18 విమానాలు ఫ్లీట్‌లో చేరతాయి. నవంబర్ 2021లో విమానయాన సంస్థ 72 బోయింగ్ 737 MAX జెట్ విమానాలను బోయింగ్‌కు ఆర్డర్ చేసింది. 19 బిలియన్ డాలర్లకు డీల్ జరిగింది. బోయింగ్ నుంచి ప్రతి నెలా 1-2 విమానాలు డెలివరీ అవుతాయని దూబే తెలిపారు.