AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు వీరికి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి.. ఆస్తి వివాదాలు తొలగిపోతాయి.. శనివారం రాశిఫలాలు..

ఈరోజు వీరికి కొత్తవారితో పరిచయం ఏర్పడుతుంది.. మంచి ఆలోచనలను కలిగి ఉంటాయి.. బంధుమిత్రులను కలుసుకుంటారు. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది.

Horoscope Today: ఈరోజు వీరికి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి.. ఆస్తి వివాదాలు తొలగిపోతాయి.. శనివారం రాశిఫలాలు..
Horoscope Today
Rajitha Chanti
|

Updated on: Jun 25, 2022 | 7:32 AM

Share

మేష రాశి.. ఈరోజు వీరు విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.. ఆర్థికంగా ఇబ్బందులు తగ్గుతాయి.. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.. శుభవార్తలు వింటారు.. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు.. బంధుమిత్రులతో విభేదాలు తగ్గుతాయి..

వృషభ రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులంటిలోనూ విజయం పొందుతారు.. శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.. కుటంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు.. సన్నిహితులను కలుసుకుంటారు.. విందులు, వినోదాల్లో పాల్గోంటారు..

మిథున రాశి.. ఈరోజు వీరికి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబపరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు.. స్త్రీలకు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.. బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సంఘంలో కీర్తి, ప్రతిష్టల పట్ల జాగ్రత్తగా ఉండాలి..

కర్కాటక రాశి.. ఈ రోజు వీరికి స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు.. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.. దైవ దర్శనం చేసుకుంటారు.. బంధుమిత్రులను కలిసుకుంటారు.

సింహ రాశి.. నూతన వ్యక్తులతో పరిచయం విషయంలో జాగ్రత్తలు అవసరం. సంఘంలో కీర్తి ప్రతిష్టల పట్ల జాగ్రత్తగా ఉండాలి.. చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. దైవ దర్శనం చేసుకుంటారు.. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.. సోదరులతో వైరం కలిగే అవకాశం ఉంది..

కన్య రాశి.. ఈరోజు వీరికి అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది.. ఇతురలకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండాలి. అనారోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్తిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్పూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది..

తుల రాశి.. ఈరోజు వీరు వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.. వ్యాపార రంగంలోని వారికి లాభాలు ఉంటాయి.. రుణ ప్రయత్నాలు చేస్తారు. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు.. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.

వృశ్చిక రాశి.. వీరు ఈరోజు చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది.. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది… కొత్త పనులను ప్రారంభించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం మంచిది కాదు..

ధనుస్సు రాశి.. ఈరోజు వీరు గతంలో వాయిదా వేసిన పనులను పూర్తిచేసుకుంటారు.. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది.. స్థిర నివాసం ఉంటుంది.. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు.. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి.. బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది.

మకర రాశి.. ఈరోజు వీరికి చేపట్టిన పనులలో ఇబ్బందులు ఉంటాయి.. కొత్త పనులను ప్రారంభించడంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. గృహంలో జరిగే మార్పుల వలన ఆందోళన చెందుతారు..ప్రయాణాలు చేయడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తవారితో పరిచయం ఏర్పడుతుంది.

కుంభరాశి.. ఈరోజు వీరికి కొత్తవారితో పరిచయం ఏర్పడుతుంది.. మంచి ఆలోచనలను కలిగి ఉంటాయి.. బంధుమిత్రులను కలుసుకుంటారు. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది..

మీన రాశి..  ఈరోజు వీరికి కుటుంబంలో చిన్న చిన్న గొడవల కారణంగా మానసిక ఒత్తిడి అధికమవుతుంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం… ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సహయం అందుతుంది..

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)